11:11 Telugu Movie : రానా రిలీజ్ చేసిన 11:11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్.. వీడియో వైరల్..

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ నటిస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘11: 11’ మోషన్ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది..

11:11 Telugu Movie : రానా రిలీజ్ చేసిన 11:11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్.. వీడియో వైరల్..

11:11 Telugu Movie

11:11 Telugu Movie: ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ జంటగా.. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా, కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘11: 11’. గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాత.ః

Sundarangudu Movie : ‘సుందరాంగుడు’ విడుదలకు సహకరించండి- హీరో కృష్ణ సాయి..

సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరో దగ్గుబాటి రానా ‘11:11’ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.

1945 Movie : క్లైమాక్స్ లేకుండా రిలీజ్ చేసిన రానా సినిమా.. నాకేం సంబంధం లేదు అంటున్న రానా

ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్‌లో కేవలం మూడు క్యారెక్టర్స్ చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం లాంటి సీన్స్ ఈ వీడియోలో కనిపించాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌కి తోడు మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి.

Rana Daggubati : శింబు ‘మానాడు’ సినిమాని రీమేక్ చేయబోతున్న రానా

మెగాస్టార్ చిరంజీవి గతంలో ఈ ‘11: 11’ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసి చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇప్పుడు మోషన్ పోస్టర్ విషయంలో రానా సపోర్ట్ దొరికింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలని రానా ట్వీట్ చేశారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్‌డేట్స్ ప్రకటించనున్నారు మేకర్స్.