Maharashtra : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం…15 మంది మృతి

మహారాష్ట్రలో మంగళవారం తెల్లవారుజామున గిర్డర్ లాంచర్ మెషీన్ కుప్పకూలిన ఘటనలో 15మంది మరణించారు. థానే నగరంలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ మెషీన్ కూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు....

Maharashtra : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం…15 మంది  మృతి

Thane accident

Maharashtra : మహారాష్ట్రలో మంగళవారం తెల్లవారుజామున గిర్డర్ లాంచర్ మెషీన్ కుప్పకూలిన ఘటనలో 15మంది మరణించారు. థానే నగరంలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ మెషీన్ కూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. (Girder Launching Machine Collapses) మరణించిన వారితో పాటు మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

Anju-Nasrullah Wedding : అంజూ-నస్రుల్లా వివాహం వెనుక పాక్ ఐఎస్ఐ కుట్ర…మధ్యప్రదేశ్ పోలీసుల విచారణ

థానేలోని (Maharashtra) సర్లాంబే గ్రామ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతుండగా ప్రమాదం జరిగింది. గిర్డర్ యంత్రాన్ని అనుసంధానించే క్రేన్, స్లాబ్ 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడి పెను ప్రమాదం సంభవించింది. గాయపడిన వారితో పాటు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Womens : ఆర్మీలో చేరే మహిళలకు కేంద్రం శుభవార్త

పోలీసు సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయ, సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. థానే జిల్లాలోని షాహాపూర్ తహసీల్‌లో బ్రిడ్జి స్లాబ్‌పై క్రేన్ పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది