2024 Election : రాహుల్..ఆర్‌జీ కనెక్ట్ పేరుతో యాప్..ఊరూరా వాట్సాప్ గ్రూపులు

వాట్సప్ గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉండే సభ్యులు...పార్టీ సభ్యులతో కలిసి...ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణ ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా ప్రచారం...

2024 Election : రాహుల్..ఆర్‌జీ కనెక్ట్ పేరుతో యాప్..ఊరూరా వాట్సాప్ గ్రూపులు

Rahul Gandhi

RG Connect APP : సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేస్తోంది. సాధారణ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. పార్టీలకు ప్రాణవాయువుగా మారిన సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది హస్తం పార్టీ. రాజకీయ ప్రచారంతో పాటు, ఓటర్లను ఆకర్షించడం కోసం అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తోంది కాంగ్రెస్. అలాగే ప్రత్యేక యాప్‌లూ రూపొందించే పనిలో పడింది. రాహుల్, ఆర్‌జీ కనెక్ట్ పేరుతో యాప్ అందుబాటులోకి తెచ్చింది.

Read More : BJP Muralidhara Rao : సీఎం కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయం : మురళీధరరావు

RG కనెక్ట్‌ 2024 పేరుతో వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి…అందులో పోస్ట్ చేసే పార్టీ కార్యక్రమాలను, వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లోనూ విరివిగా షేర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ముందుగా రాష్ట్రాల స్థాయిలో పెద్ద సంఖ్యలో గ్రూప్‌లు ఏర్పాటు చేయడం, తర్వాత జోనల్‌ స్థాయిలో, అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వీటిని విభజించనుంది.. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల స్థాయి నుంచి బూత్‌ లెవల్‌కూ ఈ గ్రూప్‌లను విస్తరించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నారు.

Read More : Punjab AAP : డోర్ టు డోర్ క్యాంపెయిన్…ఆప్‌‌కు నోటీసులిచ్చిన రిటర్నింగ్ ఆఫీసర్

వాట్సప్ గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉండే సభ్యులు…పార్టీ సభ్యులతో కలిసి…ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణ ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా ప్రచారం ఉంటుంది. కార్యకర్తల సంఖ్యను పెంచుకోవడం, పార్టీని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. సోషల్ మీడియా ప్రచారానికి రాహుల్ కనెక్ట్ అనే పేరు పెట్టడం ద్వారా పార్టీకి భవిష్యత్తులో నాయకత్వం వహించేంది రాహుల్ గాంధీనే అని స్పష్టమైన సంకేతాలు పంపుతోంది కాంగ్రెస్. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.