Puri Temple Kitchen: పూరీ జగన్నాథుడి క్షేత్ర పాకశాలలో మట్టి పొయ్యిలు ధ్వంసం: విచారణకు ఆదేశం

పూరీ జగన్నాథ ఆలయంలో పాకశాలలో ఉన్న 40 మట్టి పొయ్యిలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేగింది.

Puri Temple Kitchen: పూరీ జగన్నాథుడి క్షేత్ర పాకశాలలో మట్టి పొయ్యిలు ధ్వంసం: విచారణకు ఆదేశం

Puri

Puri Temple Kitchen: ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షేత్రంలోని పాకశాలలో ఉన్న 40 మట్టి పొయ్యిలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. శనివారం పాకశాలను మూసివేసిన సేవకులు..ఆదివారం తిరిగి తెరిచి చూసేసరికే మట్టి పొయ్యిలు ధ్వంసం అయి ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించగా..వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA) మరియు పూరీ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈకేసు పై దర్యాప్తు చేస్తున్నారు. వంటగది చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు.

Also read:Air Ambulances: దేశం మొత్తం మీద కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే ఉన్నాయి: కేంద్రం

అత్యంత పవిత్రమైన పూరీ జగన్నాథుడి ఆలయ వంట గదిలో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారెవరైనా ఉపేక్షించేది లేదని వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పురాతన దేవాలయంగా ఎంతో దివ్యమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న పూరీ జగన్నాథ ఆలయంలో వంటశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి జగన్నాధుడి అవతారంలో మధ్యాహ్నానికి పూరీ క్షేత్రం చేరుకొని “మహాప్రసాదం” ఆరగిస్తారని చెప్పబడింది. ఇక్కడ వడ్డించే భోజనాన్ని మహాప్రసాదం అనిపిలుస్తారు.

Also read:Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర గర్భగుడి నమూనా చిత్రం విడుదల: 2023 చివరి నాటికి విగ్రహ ప్రతిష్ట

ఇక్కడి వంటగదిని “రోసాఘరా”గా పిలుస్తారు. సాక్షాత్తు మహాలక్ష్మీ ఈ వంటలను పర్యవేక్షిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. జగన్నాథుడి రాకకోసం ఇక్కడ నిత్యం 56 రకాల వంటకాలు సిద్ధం చేసి దేవదేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన పూరీ ఆలయ వంటగదిలో మొత్తం 240 మట్టి పొయ్యిలు ఉన్నాయి. ఇక్కడ ఒకసారి వినియోగించిన పాత్రలను(మట్టి కుండలు) తిరిగి ఉపయోగించరు. ఎంతమంది ప్రజలు ఆకలితో వచ్చినా..ఇక్కడ ఎప్పుడు ఒకరికి భోజనం మిగిలే ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.

Also read:PiyushGoyal On Goods Exports : రికార్డు స్థాయిలో ఎగుమతులు.. ఆత్మ నిర్భర్ దిశగా భారత్-పీయూష్ గోయల్