Air Ambulances: దేశం మొత్తం మీద కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే ఉన్నాయి: కేంద్రం

దేశ వ్యాప్తంగా కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే అందుబాటులో ఉన్నట్లు పౌరవిమానయానశాఖ మంత్రి వీకే సింగ్ తెలిపారు. 19 ఆపరేటింగ్ సంస్థల ఆధ్వర్యంలో ఈ 49 ఎయిర్ అంబులెన్సు సేవలు

Air Ambulances: దేశం మొత్తం మీద కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే ఉన్నాయి: కేంద్రం

Airmabulance

Air Ambulances: అత్యవసర సమయంలో ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు అంబులెన్సు సేవలు ఎంతగా అక్కరకు వస్తాయో అందరికి తెలిసిందే. అయితే ప్రాంతాన్ని బట్టి అంబులెన్సు రవాణా సేవల్లోనూ రోడ్డు మార్గం సహా, వాయు మార్గం, నీటి మార్గం ద్వారా నడిచే అంబులెన్సులు ఉంటాయి. అత్యవసర సమయంలో వాయు మార్గంలో సుదూర ప్రాంతాల నుంచి బాధితులను తరలించడానికి ఎయిర్ అంబులెన్సులను వినియోగిస్తారు. అయితే దేశ వ్యాప్తంగా కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే అందుబాటులో ఉన్నట్లు పౌరవిమానయానశాఖ మంత్రి వీకే సింగ్ తెలిపారు. గత వారం పార్లెమెంటులో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 19 ఆపరేటింగ్ సంస్థల ఆధ్వర్యంలో ఈ 49 ఎయిర్ అంబులెన్సు సేవలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.

Also read:Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర గర్భగుడి నమూనా చిత్రం విడుదల: 2023 చివరి నాటికి విగ్రహ ప్రతిష్ట

వీటిలో 39 సర్వీసులు ఢిల్లీలో ఉండగా..మహారాష్ట్రలో 5, కేరళలో 2, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రలో ఒక్కటి చొప్పున సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. గత మూడేళ్ళలో 4,100 మంది అత్యవసర బాధితులు ఈ ఎయిర్ అంబులెన్సు సేవలను వినియోగించుకున్నట్లు వీకే సింగ్ వివరించారు. ఎయిర్ అంబులెన్సులు రూరల్ ఏరియాల్లోనూ సులభంగా సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. అత్యవసర వైద్యం, ఫైర్ యాక్సిడెంట్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎయిర్ అంబులెన్సు సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

Also read:Not Meteors: అవి ఉల్కలు కాదు రాకెట్ విడి భాగాలు: మహారాష్ట్రలో ఉల్కాపాతంపై మిస్టరీ

ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అందించే ఈసేవల గురించి నగరాల్లోని ప్రజలకు సైతం పూర్తిగా అవగాహన లేకపోవడంతో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు సైతం బీమా పొందినవారికి నగదు రహిత ఎయిర్ అంబులెన్సు సేవలు అందిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ లోని కొన్ని దేశాల్లో ఈ ఎయిర్ అంబులెన్సు సేవలను ప్రజలు విరివిగా ఉపయోగించుకుంటారు.

Also read:PiyushGoyal On Goods Exports : రికార్డు స్థాయిలో ఎగుమతులు.. ఆత్మ నిర్భర్ దిశగా భారత్-పీయూష్ గోయల్