5G spectrum: 5జీ వేలానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

20 సంవత్సరాల వ్యాలిడిటీతో 5జీ వేం నిర్వహిస్తారు. జూలై చివరికల్లా ఈ వేలం పూర్తవుతుంది. కేంద్ర నిర్ణయం ప్రకారం బిడ్డింగ్‌ గెలుచుకున్న సంస్థలు 20 వాయిదాల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో వేలం జరుగుతుంది.

5G spectrum: 5జీ వేలానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

5g Spectrum

5G spectrum: దేశంలో 5జీ సేవల అందుబాటులో ముందడుగు పడింది. టెలికాం సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 5జీ వేలంపై నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మొత్తం 72097.85 మెగా హెర్జ్‌కు సంబంధించి టెలికాం శాఖ వేలం నిర్వహిస్తుంది.

Boy Rescued: బోరుబావిలో బాలుడు.. 110 గంటల తర్వాత సురక్షితంగా..

20 సంవత్సరాల వ్యాలిడిటీతో 5జీ వేం నిర్వహిస్తారు. జూలై చివరికల్లా ఈ వేలం పూర్తవుతుంది. కేంద్ర నిర్ణయం ప్రకారం బిడ్డింగ్‌ గెలుచుకున్న సంస్థలు 20 వాయిదాల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో వేలం జరుగుతుంది. లో కేటగిరీలో 600 మెగా హెర్జ్, 700 మెగా హెర్జ్, 800 మెగా హెర్జ్, 900 మెగా హెర్జ్, 1800 మెగా హెర్జ్, 2100 మెగా హెర్జ్, 2300 మెగా హెర్జ్ ఉంటాయి. మిడ్ రేంజ్ కేటగిరీలో 3,300 మెగా హెర్జ్, హై రేంజ్ కేటగిరీలో 26 గిగాహెర్జ్ ఉంటాయి. వేలం పూర్తైతే త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 4జీ కన్నా, 5జీ పది రెట్లు వేగంగా పనిచేస్తుంది.

COVID-19: తొమ్మిదివేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు

డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాల అమలులో భాగంగా డిజిటల్ కనెక్టివిటీలో త్వరలో ప్రారంభమయ్యే 5జీ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్రం ప్రకటించింది. ప్రముఖ టెలికాం సంస్థలు ఈ వేలంలో పాల్గొంటాయి. మరోవైపు ఈ దశాబ్దం చివరికల్లా 6జీ సేవలను కూడా ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. దీనికోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.