COVID-19: తొమ్మిదివేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు

మంగళవారం దేశవ్యాప్తంగా 8,892 కరోనా కేసులు నమోదుకాగా, 15 మంది మరణించారు. ఒక్క రోజులోనే కరోనా కేసులు 3,089 పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.

COVID-19: తొమ్మిదివేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు

Covid 19

COVID-19: దేశంలో కరోనా కేసులు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 8,892 కరోనా కేసులు నమోదుకాగా, 15 మంది మరణించారు. ఒక్క రోజులోనే కరోనా కేసులు 3,089 పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 0.12 శాతం యాక్టివ్ కేసులు ఉండగా, కేసుల సంఖ్య 53,637గా ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,32,45,517. కరోనాతో మరణిచిన వారి సంఖ్య 5,24,792. కోవిడ్ రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది.

Boy Rescued: బోరుబావిలో బాలుడు.. 110 గంటల తర్వాత సురక్షితంగా..

దేశంలో 195.5 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. మంగళవారం 13.58 లక్షల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 5,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 2,956 కేసులు నమోదుకాగా, కేరళలో 1,986, ఢిల్లీలో 1,18 కేసులు నమోదయ్యాయి. ఆగష్టు 7, 2020న దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకోగా, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలకు చేరుకుంది. అదే ఏడు డిసెంబర్ 19న కేసుల సంఖ్య ఒక కోటికి చేరుకుంది. మే 4, 2021న కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరింది. జూన్ 23న మూడు కోట్లకు చేరింది. ఇప్పటివరకు నాలుగు కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి.