Uttar pradesh : కొడుకు మృతి..28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్న 70 ఏళ్ల మామ

28 ఏళ్లకే భర్తను కోల్పోయిన కోడలికి తండ్రిగా, అండగా ఉండాల్సిన మామ కూతురిలా చూసుకోవాల్సిన కోడలిని భార్యను చేసుకున్నాడు. భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్న మామ కొడుకు చనిపోయి ఒంటరి అయిన కోడలిని పెళ్లి చేసుకున్నాడు.

Uttar pradesh : కొడుకు మృతి..28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్న 70 ఏళ్ల మామ

uttar pradesh

uttar pradesh : 28 ఏళ్లకే భర్తను కోల్పోయిన కోడలికి తండ్రిగా, అండగా ఉండాల్సిన మామ కూతురిలా చూసుకోవాల్సిన కోడలిని భార్యను చేసుకున్నాడు. భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్న మామ కొడుకు చనిపోయి ఒంటరి అయిన కోడలిని పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ లో జరిగింది. గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో నివసిస్తున్న 70 ఏళ్ల కౌలాశ్ యాదవ్ బర్హల్‌‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి నలుగురు పిల్లలు. వారందరికి వివాహాలు చేశాడు. ఎవరి కాపురాలు వారు చేసుకుంటున్నారు. 12 ఏళ్ల క్రితమే కైలాశ్ యాదవ్ భార్య చనిపోయింది.

ఈక్రమంలో కొన్నేళ్ల క్రితం కైలాశ్ యాదవ్ మూడవ కుమారుడు చనిపోయాడు. దీంతో 28 ఏళ్ల కోడలు పూజ ఒంటరి అయ్యింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు 70 ఏళ్ల కైలాశ్. దానికి కోడలు కూడా అంగీకరించింది. ఇక ముహూర్తం ఫిక్స్ అయ్యింది. స్థానికంగా గుడిలో కోడలు నుదుట సింధూరం దిద్ది, పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ వివాహానికి పూజ తరపు బంధువులు, గ్రామస్థులు వచ్చారు. దంతపతుల్ని ఆశీర్వదించారు.

సోషల్ మీడియాలో వార్త వైరల్ అవడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. కానీ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో బర్హల్‌గంజ్ పోలీస్ లు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ పెళ్లి ఇద్దరి ఇష్టప్రకారమే జరిగిందని కాబట్టి మేం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.