COVID-19 Deaths : కేరళలో వ్యాక్సిన్ వేసుకోనివాళ్లలోనే 90శాతం మరణాలు!

కేరళలో కరోనా మరణాలకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని కరోనా మరణాల్లో 90శాతం కొవిడ్ టీకా వేయించుకోనివాళ్లే ఉన్నారని అధ్యయనంలో తేలింది.

COVID-19 Deaths : కేరళలో వ్యాక్సిన్ వేసుకోనివాళ్లలోనే 90శాతం మరణాలు!

90% Of Covid Deaths In Kerala Reported Among Unvaccinated

COVID-19 deaths in Kerala : కేరళలో కరోనా మరణాలకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని కరోనా మరణాల్లో 90శాతం కొవిడ్ టీకా వేయించుకోనివాళ్లే ఉన్నారని అధ్యయనంలో తేలింది. గత కొన్ని నెలల్లో కొవిడ్-19తో మరణించిన వారిలో ఎక్కువమంది కనీసం సింగిల్ డోసు టీకా కూడా తీసుకోలేదని కేరళ స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్ నిర్వహించిన అధ్యయనంలో రుజువైంది. మహమ్మారి వ్యాధి కారణంగా జూన్ 18 నుంచి సెప్టెంబర్ 3, 2021 వరకు మరణించిన 9,195 మందిలో 905 (9.84శాతం) మందికి మాత్రమే టీకాలు తీసుకున్నట్టు గుర్తించారు. కరోనాతో మరణించిన సుమారు 700 మంది ఒకే మోతాదులో టీకాను తీసుకున్నారు. చనిపోయినవారిలో కేవలం 200 మంది మాత్రమే రెండు డోసుల టీకాను తీసుకున్నారు. చనిపోయిన వారిలో చాలా మందికి ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. 2020 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ డెల్టా వేరియంట్ క్రమంగా విజృంభిస్తోంది. అదే సమయంలో కేరళలో మరణాల రేటుపై అధ్యయనం నిర్వహించారు.

జిల్లాల వారీగా మరణాలు :
కేరళలో ఈ రెండున్నర నెలల కాలంలో 1,021 అత్యధిక మరణాలు త్రిస్సూర్ జిల్లా నుంచే నమోదయ్యాయి. త్రిస్సూర్‌లో చనిపోయిన వారిలో, కేవలం 60 మంది మాత్రమే కనీసం ఒక మోతాదు టీకాను తీసుకున్నారు. పాలక్కాడ్‌ జిల్లాల్లో కరోనాతో మరణించిన 958 మందిలో.. 89 మంది మాత్రమే కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు. టీకాలు తీసుకున్న వారిలో 50కిపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఎర్నాకుళం (81), కోజికోడ్ (74), మలప్పురం (73) పతనంతిట్ట (53) జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి. రెండు డోసుల టీకాలు తీసుకున్న వారిలో మరణాల సగటు శాతం ప్రతి జిల్లాలో కేవలం 15గా మాత్రమే నమోదైంది.
Read More : COVID Vaccines : ఈ వ్యాక్సిన్లు ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుంటాయి..సరికొత్త కోవిడ్ టీకాలు

67.43 శాతం తీవ్రమైన మరణాలు :
కేరళ రాష్ట్రంలో మొత్తం 9,195 మరణాలలో.. 6,200 (67.43శాతం) మందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేనవారిలో దాదాపు 2,995 మంది కరోనాతో మరణించారు. కొవిడ్ -19 మరణాల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలైన మధుమేహం (26.41శాతం), గుండె సమస్యలు (11.07శాతం), మూత్రపిండ సమస్యలు (8.19శాతం), శ్వాసకోశ సమస్యలు (4.14శాతం), పక్షవాతం (2.73శాతం) థైరాయిడ్ (1.67శాతం)తో బాధపడేవారే ఎక్కువగా ఉన్నారు. కరోనాతో మరణించిన వారిలో కేన్సర్ ఉన్న వారు చాలా తక్కువగా ఉన్నారు.

వ్యాక్సిన్‌పై అయిష్టత :
కేరళలో వ్యాక్సిన్ పై అయిష్టత కారణంగా టీకా వేయించుకునేందుకు ముందుకు రానిరావు ఉన్నారు. అందులో యువకుల కంటే వృద్ధులే అధికంగా ఉన్నారు. వీరంతా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే.. 45 ఏళ్లు పైబడిన దాదాపు 92 శాతం మందికి మొదటి మోతాదు టీకాలు అందించామని కేరళ ప్రభుత్వం చెబుతోంది. కానీ, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే చాలా మంది వృద్ధులు కనీసం ఒకసారి కూడా టీకా తీసుకోలేదని అంచనా. ఆ వ్యక్తులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచిస్తోంది.

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారిలో దాదాపు 9 లక్షల మంది టీకాలు తీసుకోవాడానికి సిద్ధంగా లేరని కేరళ సీఎం ఇటీవలే వెల్లడించారు. కరోనా ప్రభావం నుంచి బయటపడాలంటే అందరూ తప్పనిసరిగా రెండు మోతాదుల టీకా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే టీకా సమర్థతవంతంగా పనిచేస్తుంది. సింగిల్ డోసుతో టీకా పెద్దగా ప్రభావం చూపదు. రెండు డోసుల టీకా తప్పనిసరి.. కేరళలో కరోనా మరణాల సంఖ్యను జూన్ 18 నుంచి మాత్రమే లెక్కించినట్టు అధ్యయనం చెబుతోంది.
Read More : Covid Vaccine.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చగలదు.. ఎలాగంటే?