Oscar Awards : వచ్చే ఏడాదికి రెడీ అయిపోయిన ఆస్కార్.. డేట్స్ రిలీజ్ చేసిన కమిటీ..

తాజాగా వచ్చే ఏడాదికి కూడా ఆస్కార్ అవార్డుల వేడుక తేదీని ప్రకటించారు నిర్వాహకులు. తమ సోషల్ మీడియా వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ఎంట్రీ, నామినేషన్స్.................

Oscar Awards : వచ్చే ఏడాదికి రెడీ అయిపోయిన ఆస్కార్.. డేట్స్ రిలీజ్ చేసిన కమిటీ..

Oscar

Oscar Awards :  ఇటీవల జరిగిన 94వ ఆస్కార్ వేడుకలు గతంలో కంటే ఎక్కువ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అవార్డు వేడుకలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఓ కమెడియన్ ని వేదిక మీద కొట్టడంతో అది ప్రపంచమంతా పాపులర్ అయి ఈసారి ఆస్కార్ అవార్డ్స్ వైరల్ గా మారాయి. ఆ సంఘటన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తాజాగా వచ్చే ఏడాదికి కూడా ఆస్కార్ అవార్డుల వేడుక తేదీని ప్రకటించారు నిర్వాహకులు. తమ సోషల్ మీడియా వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ఎంట్రీ, నామినేషన్స్ డేట్స్, తదితర వివరాలని ప్రకటించారు. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్న ఈ 95వ ఆస్కార్‌ అవార్డు వేడుక 2023 మార్చి 12న జరగనుంది.

Sunil : పుష్ప, F3 ఒకేసారి షూట్.. అందులో విలన్, ఇందులో కమెడియన్.. దూల తీరిపోయింది..

దీనికి సంబంధించిన ముఖ్య తేదీలు..

అవార్డుకి పోటీ చేయాలనుకునే వారు తమకి సంబంధించిన కేటగిరీలలో వివరాలు 2022 నవంబర్ 15 లోపు పంపాలి. డిసెంబర్‌ 12న ప్రాథమిక ఓటింగ్‌ మొదలై డిసెంబర్ 15న ముగుస్తుంది.
డిసెంబర్‌ 21న ఆస్కార్ ఎంట్రీలో ఉన్న షార్ట్‌లిస్ట్స్‌ని ప్రకటిస్తారు.
2023 జనవరి 12 నుంచి 17లోపు నామినీల ఓటింగ్‌ జరుగుతుంది.
ఫైనల్ నామినేషన్‌ దక్కించుకున్న సినిమాలు, వ్యక్తుల జాబితాని జనవరి 24న ప్రకటిస్తారు.
ఫైనల్‌ ఓటింగ్‌ మార్చి 2 నుంచి మార్చి 7లోపు జరుగుతుంది.
విజేతలని మార్చి 12న ఆస్కార్ వేదిక మీద ప్రకటిస్తారు. మరి ఈ సారి ఏ సినిమాలు పోటీపడతాయో, ఎన్ని అవార్డులు గెలుస్తాయో చూడాలి.