Zika Virus Pune : మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం.. వృద్ధుడిలో గుర్తింపు
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టించింది. పూణెలోని బవ్ ధాన్ లో 67 ఏళ్ల వృద్ధుడికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం వృద్ధుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Zika virus
Zika Virus Pune : మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టించింది. పూణెలోని బవ్ ధాన్ లో 67 ఏళ్ల వృద్ధుడికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. రోగిలో జికా వైరస్ ఉన్నట్లు పుణెలో బయటపడినా నిజానికి ఆయన నాసిక్ చెందినవాడు గమనార్హం. అక్టోబర్ 22వ తేదీన అతను నాసిక్ నుంచి సూరత్ కు వచ్చాడు. నవంబర్ 6వ తేదీన ఆయన సూరత్ నుంచి పుణె వెళ్లాడు.
Zika Virus: జికా వైరస్ వ్యాప్తి.. లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ క్రమంలో వృద్ధుడు అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యులు ఆయన నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. వృద్ధుడిలో జికా వైరస్ ఉన్నట్లు నవంబర్ 30వ తేదీన పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించింది. ప్రస్తుతం వృద్ధుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.