Zika Virus: జికా వైరస్ వ్యాప్తి.. లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కొద్ది రోజులుగా నమోదువుతున్న కేసులను బట్టి చూస్తే.. ఇండియాలో మరో వైరస్ ముప్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. శనివారం రికార్డులని బట్టి చూస్తే కేరళలో 60మందికి పైగా జికా వైరస్ సోకింది. పూణెలో 50ఏళ్ల మహిళకు జికా పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది.

Zika Virus: జికా వైరస్ వ్యాప్తి.. లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Zika Virus

Zika virus: కొద్ది రోజులుగా నమోదువుతున్న కేసులను బట్టి చూస్తే.. ఇండియాలో మరో వైరస్ ముప్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. శనివారం రికార్డులని బట్టి చూస్తే కేరళలో 60మందికి పైగా జికా వైరస్ సోకింది. పూణెలో 50ఏళ్ల మహిళకు జికా పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. కేరళలో అయితే జులై 8న గర్భిణీకి వచ్చిన తొలి కేసుతో మొదలై ప్రస్తుతం 63యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆందోళన చెందాల్సిన అవసర్లేదని మహారాష్ట్ర అధికారులు అంటున్నారు.

ఎలా వ్యాప్తి చెందుతుంది?
డెంగ్యూ, ఎల్లో ఫీవర్, వెస్ట్ నైల్ వైరస్ లక్షణాలు ఉన్న జికా వైరస్.. దోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. పగటి పూట తిరిగే దోమల కారణంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. తెల్లవారు జాము, సాయంత్రం సమయాల్లో తిరిగే దోమకాటు చాలా ప్రమాదకరం.

జికా వైరస్ సంక్రమణ ఎలా?
దోమ కాటు కారణంగా వ్యాప్తి చెందే జికా వైరస్ గర్భిణీల నుంచి లోపలి పిండాలకు లేదంటే సెక్సువల్ కాంటాక్ట్ వల్ల రక్తంలోకి, అవయవమార్పిడి వల్ల జరగొచ్చు.

జికా వైరస్ లక్షణాలు?
జికా వైరస్ సోకిన వారిలో చాలా తక్కువ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. జ్వరం, శరీరంపై మచ్ఛలు, కంటి శుక్లాలు, కండరాల నొప్పులు, తలనొప్పి రెండు నుంచి ఏడు రోజుల వరకూ ఉంటాయి. వైరస్ బారిన పడ్డ 3 నుంచి 14రోజుల్లోపు లక్షణాలు బయటపడతాయని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది.

జికా కారణంగా చాలా తక్కువ మంది మాత్రమే చనిపోతారు. అందరూ హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. జికా ఇన్ఫెక్షన్ కు గురైన వారు తర్వాత ఏదైనా వైరస్ సోకినా తట్టుకోగలిగే అవకాశాలు ఉన్నాయి.

జికాను కనుగొనడం ఎలా?
జికా వైరస్ ను లక్షణాలు లేదా జికా వైరస్ సంక్రమణ ఉన్న ప్రాంతాల్లో గుర్తించగలం. అది కూడా బ్లడ్ శాంపుల్స్ సేకరించి ఇతర ఫ్లూయిడ్స్ తో పరీక్ష జరిపినప్పుడే తెలుస్తుంది.

జికా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
డీహైడ్రేషన్ కాకుండా డ్రింక్స్ తీసుకుంటూ ఉండి రెస్ట్ గా ఉండాలి. acetaminophen డ్రగ్ ఉన్న మెడిసిన్ తీసుకుని జ్వరం, బాధ నుంచి తగ్గించుకోవాలి. Aspirin లేదా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లామ్మెటరీ డ్రగ్స్ తీసుకోకుండా ఉండటమే బెటర్.

జికా వల్ల రిస్క్ ఎంతవరకూ..?
ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్ సోకితే గర్భం లోపలి శిశువు మెదడుకు ప్రమాదముంటుంది. మెదడులో పలు సమస్యలకు కూడా దారి తీయొచ్చు. కొన్ని సార్లు గర్భస్రావం అవడం, అయినప్పటికీ శిశువు ప్రాణంతో ఉండటంతో పాటు ఇతర సమస్యలు రావొచ్చు. గులైన్ బరె సిండ్రోమ్ సమస్య ఉండొచ్చు. దాని వల్ల నాడీకణ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుందని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది.