AAP: ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై సీబీఐ దాడులు.. భారీగా నగదు స్వాధీనం

బ్యాంకులను నలభై కోట్ల రూపాయలమేర మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై సీబీఐ దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని అమర్‌ఘర్ నియోజకవర్గం నుంచి జశ్వంత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచాడు.

AAP: ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై సీబీఐ దాడులు.. భారీగా నగదు స్వాధీనం

Jaswant Sing

AAP: బ్యాంకులను నలభై కోట్ల రూపాయలమేర మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై సీబీఐ దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని అమర్‌ఘర్ నియోజకవర్గం నుంచి జశ్వంత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జశ్వంత్ సింగ్‌ రూ.40 కోట్ల మేర మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలొచ్చాయి. జశ్వంత్‌తోపాటు, అతడి సోదరుడు కుల్వంత్ సింగ్, బంధువైన మరో జశ్వంత్ సింగ్‌.. ముగ్గురూ కలిసి మోసాలనికి పాల్పడ్డట్లు కేసు నమోదైంది. వీళ్లు 2014లో ఒక ఆస్తి తనఖా పెట్టి, డబ్బు తీసుకున్నారు. ఆస్తి పేరుతో మోసం చేసినట్లు 2018లో నిర్ధరణ అయింది.

BJP-AAP: అరవింద్ కేజ్రీవాల్! జాతీయత ఏంటో తెలియాలంటే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి రండి: బీజేపీ

అప్పటినుంచి ఈ కేసు నడుస్తోంది. దీంతోపాటు తీసుకున్న డబ్బును చెప్పిన కారణానికి కాకుండా, మరో దానికి వాడుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు కావడంతో, జశ్వంత్ సింగ్‌కు చెందిన మూడు చోట్ల అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.16.57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.