Glass Of Wine : రాత్రి ఒక గ్లాసు వైన్… టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్నితగ్గిస్తుందా?…

అయితే ఆహారం తీసుకోకుండా తాగినవారితో పోల్చితే భోజనంతో పాటు ఆల్కహాల్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14 శాతం తక్కువగా ఉంటుందని డేటాను విశ్లేషణ చేయటం ద్వారా కనుగొన్నారు.

Glass Of Wine : రాత్రి ఒక గ్లాసు వైన్… టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్నితగ్గిస్తుందా?…

Wine

Glass Of Wine : ఆరోగ్యంపై ఆల్కహాల్ వినియోగం వల్ల కలిగే ప్రభావాలు కత్తికి రెండువైపుల పదును అన్నట్లుగా వర్ణించబడ్డాయి. ఎందుకంటే ఆల్కాహాల్ సామర్థ్యాలు మనిషికి ఒకవైపు హానికరంగా మరోవైపు సహాయకరంగా పనిచేస్తాయి. అయితే దీనిని మనిషి ఎలా వినియోగిస్తున్నాడన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని ఒక అధ్యయన రచయిత డాక్టర్ హావో స్పష్టం చేశారు. తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ యొక్క ఎపిడెమియాలజీ అండ్ ప్రివెన్షన్, లైఫ్‌స్టైల్ & కార్డియోమెటబాలిక్ హెల్త్ కాన్ఫరెన్స్ 2022ట్రస్టెడ్ సోర్స్‌లో సమర్పించబడిన ప్రాథమిక పరిశోధన ప్రకారం, రాత్రి భోజనం తరువాత ఒకగ్లాసు వైన్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ను నివారించవచ్చని తేలింది.

గతంలో జరిపిన అధ్యయనాలు ప్రజలు ఎంత మోతాదులో తాగుతున్నారు, ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయన్న దానిపైనే దృష్టి సారించాయి. అయితే చాలా తక్కువ అధ్యయనాలు మాత్రమే మద్యం తీసుకునే సమయం వంటి ఇతర మద్యపాన వివరాలపై దృష్టి సారించాయి. పరిశోధకులు 3,12,000 కంటే ఎక్కువ మంది పెద్దల నుండి డేటాను సేకరించారు. వారంతా సాధారణ మద్యపానం చేసేవారు. అధ్యయనం ప్రారంభంలో ఎవరికీ మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ లేదు. ఈ అధ్యయనంలో పాల్గొనేవారిని సగటున 11 సంవత్సరాలు పరిశీలనజరిపారు. ఆ సమయంలో, దాదాపు 8,600 మంది టైప్ 2 డయాబెటిస్‌ బారిన పడ్డారు.

అయితే ఆహారం తీసుకోకుండా తాగినవారితో పోల్చితే భోజనంతో పాటు ఆల్కహాల్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14 శాతం తక్కువగా ఉంటుందని డేటాను విశ్లేషణ చేయటం ద్వారా కనుగొన్నారు. వైన్ తాగడం,ఇతర రకాల ఆల్కహాల్‌తో ఇది ముడిపడిఉన్నట్లు నిర్ధారించారు. పరిశోధకులు భోజనం సమయంపై ఎలాంటి డేటాను సేకరించలేదు. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 95 శాతం మంది యూరోపియన్ సంతతికి చెందిన శ్వేతజాతీయులు. అయితే ఈ ఫలితాలు ఇతరులకు వర్తిస్తాయాలేదా అన్నది కనుగోనలేకపోయారు. అధ్యయనం వివరాలు పీర్-రివ్యూడ్ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించలేదు.

డాక్టర్ కాథ్లీన్ వైన్ ది ఓహియో స్టేట్ యూనివర్శిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్‌లో ఎండోక్రినాలజిస్ట్ చెప్తున్న ప్రకారం ప్రీ డయాబెటిస్ లేదా మధుమేహం ఉన్నవారికి వైన్ మంచిదని పరిశోధన సమాచారం సూచిస్తుందని చెప్తున్నారు. అయితే కేవలం ఒక గ్లాసు వైన్ తీసుకుంటే మాత్రమే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని సూచించారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు, మితమైన వైన్ తాగే వ్యక్తులు తక్కువ శాతం మరణిస్తారని ఆమె తెలిపారు. అయితే దీనికి స్పష్టమైన కారణాలు మాత్రం తెలియదన్నారు.

వైన్ తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, విశ్రాంతి , తక్కువ ఒత్తిడికి దీనికి కారణం కావచ్చన్నారు. వైన్‌లో మధుమేహం రాకుండా చేయటంలో సహాయపడే నిర్దిష్టమైనదేదో ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కాలిఫోర్నియాలోని మిషన్ వీజోలో ప్రొవిడెన్స్ మిషన్ హాస్పిటల్‌కు చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ బర్రెరా అందించిన వివరాల ప్రకారం కుటుంబ చరిత్ర, 25 కంటే ఎక్కువ BMI వంటి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తిలో, మితమైన వైన్ తీసుకోవడం ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుందన్నారు. ప్రీడయాబెటిస్ ఉన్నవారు దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారని బర్రెరా చెప్పారు. మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటే, మద్యపానం అలవాటు లేకపోతే మద్యసేవించటం మంచిది కాదని సూచించారు.