Vijay Devarakonda : విజయ్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. వీపుపై విజయ్ దేవరకొండ టాటూ..

ఓ అమ్మాయి విజయ్ ఫోటోని వీపుపై పచ్చబొట్టు వేయించుకున్న వీడియోని సోషల్ మీడియాలో చూసి ఈ రౌడీ హీరో ఆ అమ్మాయిని లైగర్ ఆఫీస్ కి పిలిపించి..........

Vijay Devarakonda : విజయ్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. వీపుపై విజయ్ దేవరకొండ టాటూ..

Vijay Devarakonda Tatto

Updated On : July 1, 2022 / 9:56 AM IST

Vijay Devarakonda :  సినిమా హీరోలు, హీరోయిన్స్ కి చాలా మంది అభిమానులు, వీరాభిమానులు ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా వాళ్ళ పేర్లని, ఫోటోలని పచ్చబొట్టు వేయించుకునేంత పిచ్చి అభిమానులు ఉంటారు. గతంలో చాలా మంది సెలబ్రిటీల ఫ్యాన్స్ వాళ్ళ అభిమాన హీరో, హీరోయిన్స్ ఫోటోలని, పేర్లని పచ్చబొట్టు వేయించుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండకి వీరాభిమాని అయిన ఓ లేడీ ఫ్యాన్ విజయ్ ఫోటోని తన వీపుపై పచ్చబొట్టుగా వేయించుకుంది.

OTT Releases : జులై 1న ఒకేసారి బోల్డన్ని ఓటీటీ రిలీజ్‌లు.. ఆహాలో భయపెట్టబోతున్న ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’

ఓ అమ్మాయి విజయ్ ఫోటోని వీపుపై పచ్చబొట్టు వేయించుకున్న వీడియోని సోషల్ మీడియాలో చూసి ఈ రౌడీ హీరో ఆ అమ్మాయిని లైగర్ ఆఫీస్ కి పిలిపించి కలిశాడు. ఆ అభిమానితో పాటు మరో అమ్మాయి ఇద్దరూ కలిసి విజయ్ లైగర్ ఆఫీస్ కి వచ్చారు. విజయ్ దేవరకొండ వాళ్ళని దర్శకుడు పూరి జగన్నాథ్‌, ఛార్మికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వీపుపై ఉన్న విజయ్ దేవరకొండ టాటూని చూపించింది. ఎందుకు టాటూ వేయించుకున్నావు అని విజయ్ అడగడంతో ఎమోషనల్ అయింది ఈ లేడీ ఫ్యాన్. దీంతో విజయ్ దగ్గరికి తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.