Telangana Police: 21 వేల పోలీస్ కేసులు నమోదు

తెలంగాణ వ్యాప్తంగా మే 12 తేదీన నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనవసరంగా బయటతిరిగితే కేసులు నమోదు చేస్తున్నారు

Telangana Police: 21 వేల పోలీస్ కేసులు నమోదు

Telangana Police

Updated On : May 20, 2021 / 1:21 PM IST

Telangana Police: తెలంగాణ వ్యాప్తంగా మే 12 తేదీన నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనవసరంగా బయటతిరిగితే కేసులు నమోదు చేస్తున్నారు. ఇక ఈ విషయమై రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు.

లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి 21 వేల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న 6 వేల మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు భగవత్.. మరికొందరు నిబంధనలు అతిక్రమించి రోడ్డుపైకి వచ్చిన వారు ఉన్నారని వివరించారు. డీజీపీ ఆదేశాల మేరకు జీహెచ్ఏంసీ పరిధిలో 330 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు సీపీ మహేష్ భగవత్.

అనవసరంగా బయటకు వచ్చిన వారిని వదిలేది లేదని తెలిపారు. ప్రజలు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడికి పోలీసులు శ్రమిస్తున్నారని వారికి ప్రజలు సహకరించాలని కోరారు.