COVID-19: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

COVID-19: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus In India India Reports 2,483 New Cases And 1,399 Deaths In Last 24 Hours

COVID-19: దేశంలో క‌రోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త‌గా 4,518 క‌రోనా కేసులు నమోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య‌ 4,31,81,335కు చేరింది. దేశంలో హోం క్వారంటైన్‌, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య‌ 25,782కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉన్నాయి.

Delhi: ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు

క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.73 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉంది. అలాగే, వారంత‌పు పాజిటివిటీ రేటు 0.91 శాతంగా ఉంది. క‌రోనాతో మ‌రో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా వల్ల ఇప్ప‌టివ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,24,701కు చేరింది. కరోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 4,26,30,852 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 194.12 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

Biden: గ‌గ‌న‌త‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ వ‌చ్చిన విమానం.. సుర‌క్షిత ప్రాంతానికి అమెరికా అధ్య‌క్షుడు బైడెన్

కాగా, మ‌హారాష్ట్ర, కేర‌ళ వంటి రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ఆయా రాష్ట్రాలు ఇప్ప‌టికే ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశాయి. ప్ర‌జ‌లంద‌రూ మాస్కును త‌ప్ప‌నిస‌రిగా వాడాల‌ని సూచించాయి. దేశంలోని ప‌లువురు ప్ర‌ముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతుండ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే.