బేబమ్మ పాజిటివ్.. నివేదా నెగిటివ్..

బేబమ్మ పాజిటివ్.. నివేదా నెగిటివ్..

Nivetha Pethuraj: బేబమ్మగా తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న క్యూట్ కన్నడ బ్యూటీ కృతి శెట్టి వరుస ఆఫర్లతో బిజీ అయిపోతోంది. ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్- తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామి కాంబినేషన్‌లో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Nivetha Pethuraj

పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ సినిమా కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు.

Nivetha Pethuraj

ఈ సినిమాలో కథానాయికగా ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టిని ఫిక్స్ చేశారు. రామ్ ‘రెడ్’ మూవీలో పోలీస్ పాత్రలో ఆకట్టుకున్న నివేదా పేతురాజ్ నెగిటివ్ క్యారెక్టర్ చెయ్యబోతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

రామ్ – లింగుస్వామి సినిమా ప్రారంభం..