COVID-19 Vaccine: 12ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో Covovax

COVID-19 Vaccine: 12ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో Covovax

Adar Poonawalla

 

COVID-19 Vaccine: సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా బుధవారం కీలక ప్రకటన చేశారు. 12ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ కొవావ్యాక్స్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. “కొవావ్యాక్స్ పెద్దవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందా.. అంటే అవును 12ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉంటుంది” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కొవావ్యాక్స్ ఇండియాలోని చిన్నారులకు అందుబాటులో ఉంటుందని తెలిపిన మరుసటిరోజే ఈ ప్రకటన చేయడం విశేషం.

పిల్లల కోసం ఇండియా తయారుచేస్తున్న వ్యాక్సిన్ ఇదొక్కటే. యూరప్ దేశాల్లో కూడా దీనిని అమ్ముతున్నారు. 90శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. “పిల్లలను రక్షించడానికి మరో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని” ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

Read Also : 5-12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. నిర్ణయంపై ఉత్కంఠ

గత వారం నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) సీరం సంస్థ తయారుచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ 12-17ఏళ్ల మధ్య వయస్కులు వాడొచ్చని అప్రూవల్ ఇచ్చింది. గతేడాది డిసెంబరులో ఇదే వ్యాక్సిన్ ను ఎమర్జెన్సీ యూజ్‌కు వాడొద్దని ప్రభుత్వం నిషేదించింది.