Adivi Sesh : విశ్వక్‌సేన్‌కి తెలుసు అన్న తర్వాతే ఈ కథ వినడానికి ఒప్పుకున్నాను..

ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో అడివిశేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ''నేను కథ వినేటప్పుడు ఓ ప్రేక్షకుడిగానే వింటాను. ఎక్కడైనా బోర్ కొడితే మొహమాటం లేకుండా.................

Adivi Sesh : విశ్వక్‌సేన్‌కి తెలుసు అన్న తర్వాతే ఈ కథ వినడానికి ఒప్పుకున్నాను..

adivi sesh spoke about hit 2 movie

Adivi Sesh :  నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా హిట్ 2 సినిమా రాబోతుంది. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఉండనున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. నేడు డిసెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. చిత్ర యూనిట్ నిన్నటివరకు ప్రమోషన్స్ తో బిజీగానే ఉన్నారు.

Adivi Sesh : హిట్ 2 సినిమాలో కిస్ సీన్స్ చేస్తే మా అమ్మ తిట్టింది..

ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో అడివిశేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ”నేను కథ వినేటప్పుడు ఓ ప్రేక్షకుడిగానే వింటాను. ఎక్కడైనా బోర్ కొడితే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. హిట్ పార్ట్ 2 కథ నాకు చెప్పడానికి శైలేష్ వచ్చినప్పుడు, నేనే ఎందుకు చేయాలి అని అడిగాను. హిట్ 2 కథ విశ్వక్ కి కాకుండా నాకు చెప్తున్నట్టు విశ్వక్సేన్ కి తెలుసా అని అడిగాను. శైలేష్ తెలుసు అన్న తర్వాతే నేను కథ విన్నాను. నాని గారు కూడా ఫోన్ చేసి కథ వినమని చెప్పారు. కథ మొత్తం డీటైలింగ్ గా రాసుకున్నాడు. ఈ సినిమా విషయంలో నేను స్క్రిప్ట్ లో వేలు పెట్టలేదు” అని చెప్పాడు.