New Navy Chief : నేవీ కొత్త చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన హరి కుమార్

ఇండియన్ నేవీ కొత్త చీఫ్ గా అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మంగళవారం(నవంబర్-30,2021) బాధ్యతలు స్వీకరించారు. 41 ఏళ్లుగా సేవలందించి..30నెలలుగా నేవీ చీఫ్ గా కొనసాగిన

New Navy Chief :  నేవీ కొత్త చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన హరి కుమార్

Hari Kumar2

New Navy Chief  ఇండియన్ నేవీ కొత్త చీఫ్ గా అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మంగళవారం(నవంబర్-30,2021) బాధ్యతలు స్వీకరించారు. 41 ఏళ్లుగా సేవలందించి..30నెలలుగా నేవీ చీఫ్ గా కొనసాగిన అడ్మిరల్​ కరమ్​బీర్​ సింగ్​ స్థానంలో ఆర్. హరికుమార్(59) బాధ్యతలు స్వీకరించారు.

ఢిల్లీలోని సౌత్​బ్లాక్​ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు అధికారులు అడ్మిరల్ హరికుమార్​కు శుభాకాంక్షలు తెలిపారు. భారత నూతన నావికాదళపతిగా బాధ్యతలు స్వీకరించడం ఒక అరుదైన గౌరవమని.. జాతీయ నౌకాదళ సవాళ్లపై ఇండియన్ నేవీ దృష్టిసారిస్తుందని ఈ సందర్భంగా హరి కుమార్ తెలిపారు.

1962 ఏప్రిల్-12న కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో జన్మించిన హరి కుమార్.. 1983, జనవరి1న ఇండియన్ నేవీలో ఉద్యోగిగా చేరారు. 39 ఏళ్లపాటు పలు విభాగాల్లో సేవలు అందించారు. విమాన వాహక నౌక INS విరాట్ మరియు ఇతర ఉపరితల నౌకలకు నాయకత్వం వహించాడు. కాగా, కేరళ రాష్ట్రం నుంచి ఓ వ్యక్తి ఇండియన్ నేవీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. 25వ భారత నావికాదళపతిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు వెస్ట్రన్ నావల్ కమాండర్ గా పనిచేశారు హరి కుమార్.

ALSO READ RedRail : ఇకపై రైల్వేటిక్కెట్ల బుకింగ్ చాలా ఈజీ..ఐఆర్‌సీటీసీతో చేతులు కలిపిన RedBus
.