Pollution- Corona : కాలుష్యం పెరుగుతోంది..కరోనా మరణాలు కూడా పెరిగే అవకాశం: డాక్టర్ గులేరియా

కాలుష్యం..కరోనా రెండూ శ్వాసపైనే ప్రభావం చూపిస్తాయి. ప్రాణాలు తీసేస్తాయి. అందుకే కాలుష్యానికి తోడు కరోనా ప్రాణాలు తీయటానికి పొంచి ఉందని నిపుణఉలు హెచ్చరిస్తున్నారు.

Pollution- Corona : కాలుష్యం పెరుగుతోంది..కరోనా మరణాలు కూడా పెరిగే అవకాశం: డాక్టర్ గులేరియా

Pollution Corona very Danger take Care (1)

Pollution- Corona Very Danger Take care :  కాలుష్యం..కరోనా రెండూ శ్వాసపైనే ప్రభావం చూపిస్తాయి. ప్రాణాలు తీసేస్తాయి. అందుకే కాలుష్యానికి తోడు కరోనా ప్రాణాలు తీయటానికి పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని కాలుష్య పరిస్థి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీ కాలుష్యకోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంది. అసలే కరోనా సమయం..మరోపక్క కాలుష్యం మనుషుల ప్రాణాలు హరించేస్తున్నాయి. ఈక్రమంలో కాలుష్యానికి తోడు కరోనా ఊపిరి తీసేయానికి సిద్ధంగా ఉన్నాయి.

Read more : Delhis Air Pollution : దీపావళికి ముందే..కాలుష్యంతో మసకబారుతున్న ఢిల్లీ

ఈక్రమంలో ఈ కాలుష్యంతో కరోనా తీవ్రత ఎక్కువ అవుతుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. ‘‘కాలుష్యం కారణంగా ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల సమస్య పెరుగుతుంది. కాలుష్యం, కరోనా రెండు ఊపిరితిత్తులపై ప్రభావం చూపేవే కావటంతో కాలుష్యానికి తోడు కరోనా అత్యంత ప్రమాదకంగా ఉంటుందని డాక్టర్ రణ్ దీప్ గులేరియా హెచ్చరిస్తున్నారు. కాలుష్యం వల్ల కరోనా బాధితుల పరిస్థితి ప్రమాదకరంగా మారి ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉందని తెలిపారు.ఈ సమస్య కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయొచ్చనీ..కాబట్టి మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందేనని గులేరియా స్పష్టంచేశారు. వీలైతే ఎన్‌95 మాస్కులు వాడాలని..కాలుష్యంతో పాటు కరోనా నుంచి మాస్కులు ప్రాణాల్ని రక్షించటానికి ఉపయోగపడతాయని సూచించారు.

Read more : Delhi Pollution : ఢిల్లీపై దీపావళి ఎఫెక్ట్.. కాల్చారు.. కాలుష్యం పెంచారు!

కాగా ప్రతీ ఏడాదిలాగానే ఢిల్లీ వాసుల్ని దీపావళి పండుగకు బాణసంచా కాల్చవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క కోర్టు కూడా సూచిస్తోంది. అయినా ప్రజల్లో మార్పు రాలేదు.వద్దన్నా కాలుస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి ముందే ఢిల్లీలో కాలుష్య సమస్య పెరిగింది. దీనికి తోడు దీపావళి బాణసంచాతో ఈ సమస్య మరింతగా పెరిగింది. దీని ప్రభావంతో ఢిల్లీలో పేల్చిన బాణసంచా కారణంగా రికార్డుస్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది.

శనివారం నాటికి పరిస్థితి కాస్తంత చక్కబడ్డా.. కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉందని అధికారులు తెలిపారు. కాలుష్యం.. కరోనా మధ్య ఉన్న సంబంధాన్ని గులేరియా రెండు విధాలుగా వివరించారు. కాలుష్యం ఎక్కువ ఉన్న గాలిలో వైరస్ ఎక్కువ కాలం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయన్నారు. మరోవైపు వైరస్‌ సోకిన వారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు 2003 సార్స్‌ మహమ్మారి వ్యాప్తి సందర్భంగా గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యం, కరోనా రెండూ కలిస్తే మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని సూచించారు.