Delhis Air Pollution : దీపావళికి ముందే..కాలుష్యంతో మసకబారుతున్న ఢిల్లీ

శీతాకాలం వచ్చిదంటే చాలు ఢిల్లీ మసకబారిపోతుంది. ఈ ఏడాది దీపావళికి ముందే కాలుష్యం ఢిల్లీని కప్పేసింది.

Delhis Air Pollution : దీపావళికి ముందే..కాలుష్యంతో మసకబారుతున్న ఢిల్లీ

Delhis Air Pollution

Delhis Air Pollution : శీతాకాలం వచ్చిదంటే చాలు ఢిల్లీ మసకబారిపోతుంది. పొగమంచు..వాయి కాలుష్యంతోను దేశ రాజధాని కాలుష్య దుప్పటికప్పుకున్నట్లుగా మారిపోతుంది. ఈ ఏడాది దీపావళికి ముందే కాలుష్యం ఢిల్లీని కప్పేస్తోంది. నగర వాసులకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. ఈక్రమంలో ఢిల్లీలో దీపావ‌ళి పండుగ‌కు ముందే వాయు నాణ్య‌త క్షీణించింది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉందని కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి మంగళవారం (నవంబర్ 2,2021) తెలిపింది. పీఎం 2.5, పీఎం 10 కేట‌గిరీల్లో ఢిల్లీ వాయు నాణ్య‌త 252, 131గా ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ అధికారులు తెలిపారు. న‌వంబ‌ర్ 2, 3వ తేదీల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం అధికంగా ఉంటుంద‌ని ఐఎండీ తెలిపింది. న‌వంబ‌ర్ 4వ తేదీన కూడా వెరీ పూర్ క్యాట‌గిరీలో ఎయిర్ క్వాలిటీ ఉంటుంద‌ని ఐఎండీ చెప్పింది. 5, 6వ తేదీల్లోనూ వాయు నాణ్య‌త క్షీణించినా… వెరీ పూర్ క్యాట‌గిరీలోనే ఉంటుంద‌ని ఐఎండీ వెల్లడించిది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత 303గా నమోదైంది. ఫరీదాబాద్ 306, ఘజియాబాద్ 334, నోయిడాలో 303గా గాలి నాణ్యతను నమోదయిందని అధికారులు తెలిపారు. దీపావళి రోజు రాత్రికి ఢిల్లీలోని గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. గాలుల స్పీడ్ కూడా తక్కువగా ఉందని.. నవంబర్ 7తర్వాతే గాలుల వేగం పెరిగి ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు.