Delhi Pollution : ఢిల్లీపై దీపావళి ఎఫెక్ట్.. కాల్చారు.. కాలుష్యం పెంచారు!

దేశవ్యాప్తంగా వాయుకాలుష్యం పెరిగిపోయింది. దీపావళి వేళ ఒక్క రోజులోనే ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం పెరిగింది. ఢిల్లీని కొన్ని గంటల్లోనే పొగ కమ్మేసింది.

Delhi Pollution : ఢిల్లీపై దీపావళి ఎఫెక్ట్.. కాల్చారు.. కాలుష్యం పెంచారు!

Delhi Pollution Off The Charts After Diwali, Itchy Throat, Watery Eyes

Delhi Pollution with Crackers : దేశవ్యాప్తంగా వాయుకాలుష్యం పెరిగిపోయింది. దీపావళి వేళ ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం పెరిగింది. ఢిల్లీని కొన్ని గంటల్లోనే పొగ కమ్మేసింది. టపాసులు కాల్చడంతో పొల్యూషన్‌ ప్రమాదకర స్థాయిలో నమోదైంది. గాలి నాణ్యత సూచీ మరింతగా పడిపోయింది. ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత భారీగా క్షీణించింది. 2.5పై 655.07 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీవ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై 386 పాయింట్లుగా గాలి నాణ్యత ఉన్నట్టు తెలిపింది. దీపావళి సందర్భంగా ప్రజలంతా టపాసులు పేల్చడంతో భారీ స్థాయిలో వాయుకాలుష్యం పెరిగినట్టు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచించింది.

టపాసులు కాల్చడం కారణంగా కళ్ల మంటలు, గొంతునొప్పితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ 7 నాటికి ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడుతుందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ విభాగం తెలిపింది. ఇప్పటికే గతకొద్ది రోజులుగా ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు.

దీని కారణంగా గాల్లో దుమ్ము, ధూళి, కాలుష్య కారకాల శాతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ 400.25గా నమోదయ్యింది. పీఎం 2.5 కేటగిరీలో వాయు నాణ్యత 655.07గా నమోదైంది. పీఎం 10 కేటగిరీలో 705.22కి పెరిగింది. ఉదయం వరకు ఆనంద్ విహార్‌ ప్రాంతంలో గాలి నాణ్యత AQI 352గా నమోదైంది. రాత్రి వరకు భారీగా పెరిగింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. సున్నా నుంచి 50 వరకు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్టుగా చెబుతారు. 51 నుంచి 100 లోపు ఉంటే సాధారణ స్థాయిగా పరిగణిస్తారు.

300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఆ లిమిట్ కూడా దాటేసి దీపావళి పండుగ సందర్భంగా 655.07గా నమోదైంది. ఈ స్థాయిలో వాయుకాలుష్యం పెరిగితే మానవ మనుగడకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో టపాసులు పేల్చవద్దని ముందస్తుగానే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కానీ, జనం ఎక్కడా కూడా ఈ విషయాన్ని పట్టించుకున్నట్టు కనిపించలేదు. దీపావళి టపాసులను కాల్చి కాలుష్యాన్ని పెంచేశారు.
Read Also :  Pushpa : వెయ్యి మంది డ్యాన్సర్లతో పుష్ప స్పెషల్ సాంగ్