Airport Baggage: ఐపీఎస్ అధికారి బ్యాగులో అవి చూసి అవాక్కైనా ఎయిర్ పోర్ట్ సిబ్బంది

తనతో పాటుగా హ్యాండ్ బ్యాగేజి కింద ఓ సూట్ కేస్ తీసుకొచ్చాడు అరుణ్ బోత్రా. అయితే అరుణ్ బోత్రా సూట్ కేస్ ను తనిఖీ చేయాలంటూ ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. తెరిచి చూశారు.

Airport Baggage: ఐపీఎస్ అధికారి బ్యాగులో అవి చూసి అవాక్కైనా ఎయిర్ పోర్ట్ సిబ్బంది

Arun

Airport Baggage: విమానాల్లో ప్రయాణించేటపుడు ఎయిర్ పోర్టుల్లో భద్రతా సిబ్బంది ప్యాసింజర్ల లగేజీని తనిఖీ చేయడం సర్వసాధారణం. అయితే విమానాల్లో అనుమతించబడని వస్తువులు ఏవైనా ఉంటే.. తనిఖీ సమయంలో వాటిని అక్కడే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఒక ఐపీఎస్ అధికారి బ్యాగేజిని తనిఖీ చేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. ఆ సూట్ కేస్ లో ఉన్న వాటిని చూసి అవాక్కయ్యారు. సాధారణంగా ఎక్కువ లగేజి ఉంటే.. చెక్ ఇన్ బ్యాగేజికి ఇచ్చేస్తారు ప్రయాణికులు. చిన్న బ్యాగులు, బ్రీఫ్ కేస్ లాంటివి ఉంటే హ్యాండ్ బ్యాగ్ కింద ప్రయాణికుడితో వెంట తెచ్చుకునేలా అనుమతిస్తారు. అలా ఒడిశాకు చెందిన ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఇటీవల పని నిమిత్తం రాజస్థాన్ లోన్ జైపూర్ వెళ్లారు. పని పూర్తి చేసుకున్న అరుణ్ బోత్రా భువనేశ్వర్ చేరుకునేందుకు జైపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు.

Also read: Netflix: ఇకపై నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేర్ చేసుకోవచ్చట!!

తనతో పాటుగా హ్యాండ్ బ్యాగేజి కింద ఓ సూట్ కేస్ తీసుకొచ్చాడు అరుణ్ బోత్రా. అయితే అరుణ్ బోత్రా సూట్ కేస్ ను తనిఖీ చేయాలంటూ ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. తెరిచి చూశారు. అందులో ఉన్న ఐటమ్స్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. ఎందుకంటే సూట్ కేస్ నిండా పచ్చి బఠానీ కాయలు ఉన్నాయి మరి. అవును సూట్ కేస్ నిండా 10 కిలోల పచ్చి బఠానీ కాయలు నింపుకున్నాడు అరుణ్ బోత్రా. సూట్ కేసును చెక్ ఇన్ లగేజీలో ఇస్తే..అవి పాడైపోతాయని భావించిన అరుణ్.. దాని తన వెంట తీసుకెళ్తున్నట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బందికి సమాధానం ఇచ్చాడు. అది చూసిన ఎయిర్ పోర్టు సిబ్బంది నవ్వుకున్నారు. ఈ విషయాన్నీ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. నెటిజన్లు కొందరు ఎయిర్ పోర్టుల్లో తమకు ఎదురైనా అనుభవాలను షేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Also read: Tamil Nadu: ప్రజలకు ఉచితంగా ఆరోగ్య, వైద్య సేవలు..‘రైట్ టు హెల్త్’ బిల్ కోసం సీఎం యత్నాలు