Breach of protocol: బెంగళూరు విమానాశ్రయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన.. ఏకంగా గవర్నర్‭నే వదిలేసి వెళ్లిన ఎయిర్ ఏషియా విమానం

90 నిమిషాల తర్వాత గవర్నర్ మరొక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. కాగా, ఈ అంశంపై గవర్నర్ హౌస్ అధికారులు నోరు మెదపలేదు. దీనిపై ఎయిర్ ఏషియా అధికారులు కూడా స్పందించలేదు

Breach of protocol: బెంగళూరు విమానాశ్రయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన.. ఏకంగా గవర్నర్‭నే వదిలేసి వెళ్లిన ఎయిర్ ఏషియా విమానం

Kempegowda International Airport: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. గురువారం కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్‭ను వదిలేసి ఎయిర్ ఏషియా విమానం వెళ్లిపోయింది. కారణం ఆయన విమానాశ్రయానికి కాస్త ఆలస్యంగా రావడమే. దాంతో ఆయన విమానాశ్రయంలోని లాంగ్ లోనే ఆగాల్సి వచ్చిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అనంతరం ప్రొటోకాల్ ఉల్లంఘించినందుకు గాను విమానాశ్రయంలోని పోలీసు స్టేషన్లో గవర్నర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Sejal Protest : ఢిల్లీలో మరోసారి ఆరిజన్ డైరీ సీఎఓ శేజల్ ఆందోళన.. న్యాయం చేయాలంటూ పార్లమెంట్ ఎదుట నిరసన

రాజ్ భవన్ తెలిపిన సమాచారం ప్రకారం.. గవర్నర్ గురువారం మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయంలోని టెర్మినల్-2 నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అక్కడి నుంచి ఆయన రాయచూర్ లో నిర్వహించే ఒక కార్యక్రమానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి. వాస్తవానికి ఆయన ఎక్కాల్సిన ఎయిర్ ఏషియా విమానంలో ఆయన సామాన్లు సర్దారు. వాస్తవానికి ఆయన సమయానికే వీఐపీ లాడ్జీకి చేరుకోవాలి. కానీ ఆయన టెర్మినల్ కు చేరుకోవడంలో ఆలస్యం జరిగింది. దీంతో విమానం అక్కడి నుంచి ఆయనను వదిలేసి వెళ్లిపోయింది.

HYD – Vijayawada Highway Closed : హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవేపై రాకపోకలు బంద్

అనంతరం, 90 నిమిషాల తర్వాత గవర్నర్ మరొక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. కాగా, ఈ అంశంపై గవర్నర్ హౌస్ అధికారులు నోరు మెదపలేదు. దీనిపై ఎయిర్ ఏషియా అధికారులు కూడా స్పందించలేదు. కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయానన్ని నిర్వహిస్తున్న బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారి మాట్లాడుతూ “మేము సాధారణంగా ఎయిర్‌లైన్ సంబంధిత విషయాలపై మాట్లాడాము. ఎయిర్ ఏషియాతో తనిఖీ చేయాలి’’ అని అన్నారు.