Akbaruddin Owaisi: విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు.. నేడే తుది తీర్పు!

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌పై నమోదైన దేశద్రోహం కేసులో నేడు (బుధవారం) తుదితీర్పు వెల్లడి కానుంది. తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, నిజామాబాద్ పర్యటనల్లో..

Akbaruddin Owaisi: విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు.. నేడే తుది తీర్పు!

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌పై నమోదైన దేశద్రోహం కేసులో నేడు (బుధవారం) తుదితీర్పు వెల్లడి కానుంది. తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, నిజామాబాద్ పర్యటనల్లో అక్బరుద్దీన్ హిందువులు, హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా.. దాదాపు 40 రోజుల పాటు అప్పుడు జైలు శిక్ష కూడా అనుభవించారు. కాగా.. ఈ కేసు విచారణ సుమారు 9 ఏళ్ల పాటు కొనసాగగా.. హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నేడు తుది తీర్పును వెల్లడించనుంది.

Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’

ఇక, నేడు కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం కావడంతో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పకడ్భందీ చర్యలు తీసుకున్నారు. ఒవైసీకి కోర్టు శిక్ష విధిస్తే శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు వద్ద దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా.. పాతబస్తీ, నిర్మల్ పట్టణాల్లోనూ పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. దేశంలో రాజకీయ నేతలపై నమోదైన దేశద్రోహం కేసుల్లో వెలువడిన తొలి తీర్పు ఇదే కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Asaduddin Owaisi: నేను స్వేచ్ఛా జీవిని.. అలానే బతకాలనుకుంటున్నా – ఒవైసీ

అసలేంటి ఈ కేసు..?

నిర్మల్‌లోని మున్సిపల్ మైదానంలో జరిగిన సభలో సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ‘మీరు 100కోట్ల మంది ఉన్నారు.. మేము కేవలం పాతిక కోట్ల మందే ఉన్నాం. అయినా సరే.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం’ అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా నిజామాబాద్‌లో హిందూ దేవతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు అక్బరుద్దీన్‌పై ఐపీసీ 120-బీ, 153-ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు.

Asaduddin Owaisi : చావుకి భయపడను.. జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదు- అసదుద్దీన్ ఒవైసీ

ఈ కేసులకు సంబంధించి అరెస్టయిన ఆయన 40 రోజుల పాటు జైలుశిక్షను కూడా అనుభవించారు. ఈ కేసును విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు సుమారు 30మంది సాక్షులకు ప్రశ్నించగా.. సీఐడీ చార్జ్ షీట్‌లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును అధికారులు ప్రస్తావించారు. దీంతో పాటు వీడియో ఫుటేజ్‌లో ఉన్న వాయిస్ అక్బరుద్దీన్ ఓవైసీదే నిపుణులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి న్యాయస్థానం మంగళవారం తుదితీర్పు వెలువరించాల్సి ఉండగా.. అనూహ్యంగా తీర్పును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.