Akhanda: అఖండ సీక్వెల్‌లో ఈ అంశాలే కీలకం అంటోన్న బోయపాటి

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి గతంలోనే వెల్లడించాడు. అయితే, ఈ సీక్వెల్ మూవీలో పొలిటికల్ అంశం హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Akhanda: అఖండ సీక్వెల్‌లో ఈ అంశాలే కీలకం అంటోన్న బోయపాటి

Akhanda Sequel To Have These Aspects In Next Level

Akhanda: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ సినిమాతో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సాలిడ్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైనా పాత్రల్లో నటించగా, అఘోరా పాత్ర ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయగా, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి వెల్లడించాడు.

Akhanda: బాలయ్య శివతాండవానికి ఏడాది పూర్తి!

దీంతో ఈ సీక్వెల్ మూవీ ఎపుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత మళ్లీ బాలయ్యతో కలిసి అఖండ సీక్వెల్‌ను తెరకెక్కించాలని బోయపాటి రెడీ అవుతున్నాడు. అయితే, అఖండ సీక్వెల్ మూవీలో పొలిటికల్ అంశాలను నెక్ట్స్ లెవెల్‌లో చూపెట్టనున్నాడట ఈ క్రేజీ డైరెక్టర్.

Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?

బాలయ్య చెప్పే పొలిటికల్ డైలాగులు ఓ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి. మొత్తానికి అఖండ్ సీక్వెల్ మూవీతో బాలయ్యను మరోసారి పవర్‌ఫుల్‌గా చూపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడట. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించనున్నాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను బాలయ్య పుట్టినరోజున చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఈ సినిమాతో బాలయ్య మరోసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి.