Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?

మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ...

Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?

Boyapati Sreenu Shifts Focus To Akhanda Sequel

Akhanda: మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తరువాత తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. పూర్తిగా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన అఖండ చిత్రంలో బాలయ్య పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ.125 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.

Akhanda: ఓటీటీలో ‘అఖండ’ విజయం.. ఏకంగా టాప్!

అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు బోయపాటి అఖండ చిత్ర క్లైమాక్స్‌లోనే ఓ క్లూ వదిలిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలు ఇంటర్వ్యూల్లో బోయపాటి ఇదే విషయాన్ని చెప్పుకువచ్చాడు. కానీ బాలయ్యతో ఆయన చేయబోయే నెక్ట్స్ మూవీ ఓ పొలిటికల్ సబ్జెక్ట్‌గా రాబోతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో గతకొంత కాలంగా వినిపిస్తూ వస్తోంది. రాబోయే ఎన్నికల కోసం బోయపాటి ఓ పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామా మూవీని బాలయ్యతో తెరకెక్కించాలని చూస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు బోయపాటి తన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

Akhanda: అఖండ దండయాత్ర.. ఈరోజుల్లో కూడా వందరోజుల రేర్ ఫీట్

బాలయ్యతో ఆయన చేయబోయేది ఖచ్చితంగా అఖండ చిత్రానికి సీక్వెల్ అని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అఖండ సీక్వెల్ మూవీ కోసం బోయపాటి స్క్రిప్టు పనులు మొదలుపెట్టారని, త్వరలోనే ఈ సినిమా కథను పూర్తిగా రెడీ చేసి బాలయ్యకు వినిపించాలని ఆయన భావిస్తున్నాడట. అయితే అఖండ అందించిన హిట్‌తో ఈసారి సీక్వెల్ మూవీని ఏకంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని బోయపాటి బడా ప్లాన్ వేస్తున్నాడట. ఇక ఈ సినిమాను కూడా అఖండ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే బోయపాటి తన ఫోకస్ అఖండ్ సీక్వెల్‌పై పెట్టాడా అనేది తెలయాలంటే అఫీషియల్‌గా కన్ఫం చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.