Akhanda: ఓటీటీలో ‘అఖండ’ విజయం.. ఏకంగా టాప్!

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘అఖండ’ కరోనా పరిస్థితుల తరువాత రిలీజ్ అయిన తొలి భారీ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల.....

Akhanda: ఓటీటీలో ‘అఖండ’ విజయం.. ఏకంగా టాప్!

Balakrishna Akhanda Stands Top In South Ott

Akhanda: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘అఖండ’ కరోనా పరిస్థితుల తరువాత రిలీజ్ అయిన తొలి భారీ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో బాలయ్య-బోయపాటి కాంబోలో మూడో సినిమాగా అఖండ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత అన్నీ చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Akhanda: బుల్లితెరపై అఖండ ఆగమనం.. ఎప్పుడంటే..?

ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలవగా, బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయగా, అందులోనూ ఈ సినిమా అదిరిపోయే వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా అఖండ చిత్రం మరో అరుదైన ఘనత సాధించి బాలయ్య స్టామినా ఏమిటో చూపించింది. గతేడాది నుండి అన్ని రకాల ఓటీటీ ప్లాట్‌ఫాంలు, డిజిటల్ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ అయిన సినిమాలను పరిశీలించగా.. సౌత్ ఇండియాలోనే ఓటీటీలో టాప్ పర్ఫార్మర్‌గా అఖండ నిలిచింది.

Akhanda : అఖండ శత దినోత్సవ వేడుక

ఇలా ఓటీటీలోనూ బాలయ్య నటించిన చిత్రానికి ‘అఖండ’మైన రెస్పాన్స్ దక్కడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా, థమన్ సంగీతం బాక్సులు బద్దలుకొట్టింది. ఇక ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.