Akhanda: అఖండ దండయాత్ర.. ఈరోజుల్లో కూడా వందరోజుల రేర్ ఫీట్

ఒకప్పుడు సినిమా రికార్డ్ అంటే యాభై రోజులు, వంద రోజులు ప్రదర్శన. అలా ఆడిన సినిమాలే బ్లాక్ బస్టర్ సినిమాలని లెక్క. వాటికి మించి ఏకంగా ఏడాది పాటు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.

Akhanda: అఖండ దండయాత్ర.. ఈరోజుల్లో కూడా వందరోజుల రేర్ ఫీట్

Akhanda

Akhanda: మారుతున్న పరిస్థితులను బట్టి మనమూ మారాలి. అంటారు కదా.. సరిగ్గా సినిమాలలో విషయంలో కూడా మన మేకర్స్ ఇదే పాటిస్తున్నారు. ఒకప్పుడు సినిమా రికార్డ్ అంటే యాభై రోజులు, వంద రోజులు ప్రదర్శన. అలా ఆడిన సినిమాలే బ్లాక్ బస్టర్ సినిమాలని లెక్క. వాటికి మించి ఏకంగా ఏడాది పాటు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సీనియర్ హీరోలు, ఆ తర్వాత జెనరేషన్ హీరోలు కూడా ఈ రికార్డులులను చూసిన వాళ్ళే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మొదలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరూ కెరీర్ లో ఇలాంటి సినిమాలు చూసేశారు.

Akhanda : కొత్త సినిమా సెట్‌లో బాలయ్య ‘అఖండ’ వేడుక..

అయితే.. ఇప్పుడు సినిమా అంటే పట్టుమని వారం రోజులే. మహా అయితే మూడు నుండి నాలుగు వారాలు ఆడితే మహా గొప్ప సినిమా అని లెక్క. ఈ లోగా ఎంత రాబడితే అదే రికార్డ్.. ఎంత వసూళ్లు చేస్తే అదే స్టామినా. ఒకప్పుడు వందరోజులు, సిల్వర్ జూబ్లీ లాంటి పోస్టర్లు కనిపిస్తే ఇప్పుడు యాభై కోట్ల క్లబ్, వంద కోట్ల క్లబ్ అంటూ సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ కలెక్షన్లు కూడా నెల రోజులలోనే రాబట్టాలి.. ఆ తర్వాత ఓటీటీలు, టెలివిజన్ ప్రీమియర్లు కూడా జరిగిపోవాలి.. అక్కడ కూడా భారీ మార్కెట్ దక్కించుకోవాలి. అలా అయితేనే పెట్టిన భారీ పెట్టుబడులు రాబట్టుకొనేది.

Akhanda: మాస్ మేనియాకు వంద రోజులు.. అఖండ కృతజ్ఞత సభ!

భారీ ఓపెనింగ్స్, ఫస్ట్ డే నుండి ఫస్ట్ వీక్ కలెక్షన్ల కోసం నిర్మాతలు అదనంగా భారీ ఖర్చు చేసి ఎవరికి వారు ప్రమోషన్లు చేపట్టి సినిమాల మీద హైప్ పెంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారం మరో కొత్త సినిమా థియేటర్లలో దిగిపోతే ఎక్కడ చూసినా మళ్ళీ ఆ సినిమా హడావుడే. ప్రస్తుతం సినిమాల రిలీజ్, ప్రదర్శనలో ఇదంతా ఓ ఛట్రంలా జరిగిపోతుంది. అయితే.. వీటికి భిన్నంగా రెండు వారాలు థియేటర్లలో బొమ్మ ఆడితే గొప్పనుకొనే ఈ రోజుల్లో కూడా బాలకృష్ణ అఖండ సినిమా ఏకంగా వందరోజులు ఆడి పాత రికార్డులను మళ్ళీ గుర్తు చేస్తుంది.

Pushpa-Akhanda: గడ్డు కాలంలో ఇండస్ట్రీకి బాసటగా అఖండ, పుష్ప!

అదిరిపోయే యాక్టింగ్ తో అదరగొట్టే డైలాగ్స్ తో ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇచ్చిన బాలయ్య.. అఖండ విడుదలైన పది రోజుల్లోనే రూ.102కోట్ల గ్రాస్​ మార్క్​ను టచ్​ చేసి బాక్సాపీస్ వద్ద భళా అనిపించుకున్నాడు. అఖండ ఓటీటీలో విడుదలైనా థియేటర్లలో లాంగ్ రన్ కి ఎలాంటి ఢోకా కనిపించలేదు. పక్కా మాస్ సినిమా కావడంతో బీ, సీ సెంటర్లలో అఖండకు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ఈ రోజుల్లో కూడా శతదినోత్సవ సినిమాగా అఖండతో బాలయ్య మళ్ళీ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

Akhanda Hotel : ‘అఖండ’ అభిమానం.. ఆరగించిపోండి..

ప్రేక్షకులు ఇచ్చిన అఖండ విజయానికి గుర్తుగా.. మేకర్స్ కృతజ్ఞత సభ పేరుతో అత్యంత ఘనంగా శతదినోత్సవ వేడుకలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలులోని ఎస్‌టీబీసీ గ్రౌండ్స్ లో మార్చ్ 12 శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ శతదినోత్సవ కృతజ్ఞత సభ మొదలు కానుంది. నందమూరి అభిమానులు ఈ వేడుకకు భారీగా తరలివచ్చే అవకాశం ఉండగా ఇప్పటికే అట్టహాసంగా ఏర్పాట్లు పూర్తిచేశారు.