Akhanda: మాస్ మేనియాకు వంద రోజులు.. అఖండ కృతజ్ఞత సభ!

బాక్స్ ఆఫీస్ వద్ద నందమూరి నటసింహం బాలయ్య అఖండ మేనియా కొనసాగించారు. అదిరిపోయే యాక్టింగ్ తో అదరగొట్టే డైలాగ్స్ తో అఖండ సినిమాతో ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇచ్చారు బాలయ్య.

Akhanda: మాస్ మేనియాకు వంద రోజులు.. అఖండ కృతజ్ఞత సభ!

Akhanda

Akhanda: బాక్స్ ఆఫీస్ వద్ద నందమూరి నటసింహం బాలయ్య అఖండ మేనియా కొనసాగించారు. అదిరిపోయే యాక్టింగ్ తో అదరగొట్టే డైలాగ్స్ తో అఖండ సినిమాతో ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇచ్చారు బాలయ్య. అఖండతో టాలీవుడ్ లో రాబోయే భారీ సినిమాలకు ఎనలేని నమ్మకాన్ని ఇచ్చిన బాలయ్య ఈ సినిమాతో కెరీర్ లో తొలిసారిగా వందకోట్ల క్లబ్ లో చేరారు. బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా హ్యట్రిక్ కొట్టడమే కాకుండా.. విడుదలైన పది రోజుల్లోనే రూ.102కోట్ల గ్రాస్​ మార్క్​ను టచ్​ చేసి బాక్సాపీస్ వద్ద భళా అనిపించుకున్నాడు.

Pushpa-Akhanda: గడ్డు కాలంలో ఇండస్ట్రీకి బాసటగా అఖండ, పుష్ప!

ఒకవైపు కోవిడ్ సెగ తగులుతున్నా కూడా.. ఏదైతే అదైందని ధైర్యంగా ధియేటర్లోకొచ్చిన బాలయ్య.. ఇండస్ట్రీ క్లిష్ట సమయంలో కూడా అఖండవిజయం అందుకున్నారు. ధియేటర్ నుంచి ఓటీటీకి షిఫ్ట్ అయినా అక్కడ కూడా నెంబర్ వన్ ప్లేస్ లోనే కంటిన్యూ అయింది అఖండ. ఓటీటీలో వచ్చినా థియేటర్లలో లాంగ్ రన్ కి ఎలాంటి ఢోకా లేకుండా వసూళ్లను కొల్లగొట్టిన ఘనత కూడా అఖండదే. బాలయ్య కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమా గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రాఫిట్స్ అందించిన సినిమాగా నిలిచిపోయింది.

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

థియేటర్ లో పట్టుమని పదిరోజులు కూడా సినిమాలు నిలిచే పరిస్థితిలేని ఈరోజుల్లో అసాధ్యంగా ఈ సినిమా శత దినోత్సవానికి పరుగు తీస్తుండడంతో మేకర్స్ ఈ వేడుకను అత్యంత ఘనంగా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలులోని ఎస్‌టీబీసీ గ్రౌండ్స్ లో మార్చ్ 12 శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ శతదినోత్సవ కృతజ్ఞత సభ మొదలు కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. నందమూరి అభిమానులు ఈ వేడుకకు భారీగా తరలివచ్చే అవకాశం ఉండగా ఈ వేడుక ఏ స్థాయిలో జరగనుందోనని ఆసక్తి మొదలైంది.