Prithviraj : సామ్రాట్ ‘పృథ్వీరాజ్‌’ చౌహాన్‌గా అక్షయ్ కుమార్.. టీజర్ చూశారా?

అక్షయ్ కుమార్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘పృథ్వీరాజ్’ టీజర్ రిలీజ్..

Prithviraj : సామ్రాట్ ‘పృథ్వీరాజ్‌’ చౌహాన్‌గా అక్షయ్ కుమార్.. టీజర్ చూశారా?

Prithviraj

Prithviraj: అక్షయ్ కుమార్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘పృథ్వీరాజ్’.. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కథానాయికగా తెరంగేట్రం చేస్తోంది. డా. చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

RRR Movie : ‘కొంచెం ఆగండి బ్రో.. మధ్యలో చెప్పు ఊడిపోయింది’..

సామ్రాట్ ‘పృథ్వీరాజ్‌’ చౌహాన్‌గా అక్షయ్.. అతని ప్రేమికురాలు రాణి సంయోగితగా మానుషి కనిపించనున్నారు. సోనూ సూద్, సంజయ్ దత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సోమవారం ‘పృథ్వీరాజ్’ టీజర్ రిలీజ్ చేశారు. విజువల్ వండర్‌లా అనిపించడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది ‘పృథ్వీరాజ్’ టీజర్.

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

‘పృథ్వీరాజ్’ చౌహాన్ క్యారెక్టర్ గురించి వాయిస్ ఓవర్‌తో చెప్తూ సాగిన టీజర్‌లో వార్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. మనుష్ నందన్ విజువల్స్, శంకర్ -ఎహషాన్ – లాయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యాయి. 2022 జనవరి 21న ‘పృథ్వీరాజ్’ గ్రాండ్‌గా విడుదల కానుంది.