Ali : మా ఫ్యామిలిలో తనే ఫస్ట్.. కూతురిపై ఎమోషనల్ పోస్ట్ చేసిన కమెడియన్ అలీ..

తాజాగా అలీ పెద్ద కూతురు ఫాతిమా డాక్టర్ చదువు పూర్తి చేసుకొని పట్టా అందుకుంది. ఆమె డాక్టర్ అవ్వడం అలీకి ఎప్పట్నుంచో కోరిక. తండ్రి కలని నెరవేరుస్తూ ఆమె డాక్టర్ అయింది. దీంతో అలీ.....

Ali : మా ఫ్యామిలిలో తనే ఫస్ట్.. కూతురిపై ఎమోషనల్ పోస్ట్ చేసిన కమెడియన్ అలీ..

Ali

 

Ali :  టాలీవుడ్ లో కమెడియన్ అలీ చాలా సీనియర్ నటుడు. చిన్నప్పట్నుంచీ సినిమాల్లో నటిస్తున్నారు అలీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా దాదాపు 1000 సినిమాలకు పైగానే నటించారు. ప్రస్తుతం కొన్ని కొన్ని పేరున్న సినిమాలలో నటిస్తూ టీవీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. ఇక అలీకి ముగ్గురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అలీ భార్య కూడా ఇటీవల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రేక్షకులని అలరిస్తుంది.

Nidhhi Agerwal : కండోమ్ యాడ్‌ని ప్రమోట్ చేసిన హీరోయిన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

తాజాగా అలీ పెద్ద కూతురు ఫాతిమా డాక్టర్ చదువు పూర్తి చేసుకొని పట్టా అందుకుంది. ఆమె డాక్టర్ అవ్వడం అలీకి ఎప్పట్నుంచో కోరిక. తండ్రి కలని నెరవేరుస్తూ ఆమె డాక్టర్ అయింది. దీంతో అలీ తన పెద్ద కూతురితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన కూతురితో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”కంగ్రాట్యులేషన్స్.. డాక్టర్ ఫాతిమా.. మా ఫ్యామిలిలో ఫస్ట్ డాక్టర్. నిన్ను అల్లా చల్లగా చూడాలి” అని పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు కామెంట్లలో అభినందనలు తెలియచేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ali (@ali_the_actor)