Pushpa 2 : 100 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న పుష్ప రాజ్..

అల్లు అర్జున్ పుష్ప 2 గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్లింప్స్ 100 మిలియన్ వ్యూస్‌ని కేవలం..

Pushpa 2 : 100 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న పుష్ప రాజ్..

Allu Arjun Pushpa 2 glimpse cross 100M mark in youtube in 10days

Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కలయికలో వచ్చిన మూడో సినిమా పుష్ప 2. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చి పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది. దీంతో సెకండ్ పార్ట్ పై ఇండియా వైడ్ భారీ హైప్ నెలకుంది. ఈ మూవీ అప్డేట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ చిత్రం నుంచి పుష్ప ఎక్కడ అంటూ రిలీజ్ చేసిన గ్లింప్స్ నార్త్ టు సౌత్ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా నార్త్ లోనే ఈ గ్లింప్స్ కి ఎక్కువ వ్యూస్ దక్కాయి.

Pushpa 2 : పుష్ప 2 కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న బన్నీ.. వీడియో వైరల్!

తాజాగా ఈ గ్లింప్స్ 100 మిలియన్ వ్యూస్‌ అందుకొని యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. తెలుగులో ఈ గ్లింప్స్ 26M, హిందీలో 65M, తమిళ్‌లో 5.3M, కన్నడలో 1.3M, మలయాళంలో 2.2M వ్యూస్ సంధించి 10 రోజుల్లో టోటల్ గా 100 మిలియన్ వ్యూస్ అందుకొని రికార్డు సృష్టించింది. ఒక గ్లింప్స్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక నార్త్ లో పుష్ప రేంజ్ చూస్తుంటే.. కేజీఎఫ్ 2 రికార్డ్స్ ని కొల్లగొట్టడం లేదు సందేహం లేదు అంటున్నారు అభిమానులు. మరి పుష్ప రాజ్ ఎటువంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.

NTR – Allu Arjun : మరో బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్.. రణ్‌వీర్ సింగ్‌ని కాదని!

ఇక మొదటి పార్ట్ కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమా సక్సెస్ లో మేజర్ రోల్ పోషించింది. ముఖ్యంగా ఐటెం నెంబర్ ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్ ఒక ఊపు ఊపేసింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం దేవి ఎటువంటి ఐటెం నెంబర్ ని రెడీ చేస్తున్నాడో అని అందరు ఎదురు చూస్తున్నారు. కాగా రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) విలన్ గా కనిపించబోతున్నాడు.