Allu Arjun : గాయపడిన అభిమానులను నా టీమ్ చూసుకుంటున్నారు : అల్లు అర్జున్

ఈ ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ''తాజాగా జరిగిన ఫ్యాన్స్ మీట్ లో నా అభిమానులకు గాయలు అయినట్టు తెలిసింది. గాయపడిన అభిమానులను నా టీమ్ దగ్గరుండి.......

Allu Arjun : గాయపడిన అభిమానులను నా టీమ్ చూసుకుంటున్నారు : అల్లు అర్జున్

Allu Arjun

Allu Arjun :  నిన్న రాత్రి అల్లు అర్జున్ అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ తో ఫోటో దిగే ఛాన్స్ అని సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసి వందలాది మంది బన్నీ ఫ్యాన్స్ నిన్న ఉదయం హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చారు. అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తుండటంతో ఫొటో సెషన్ లేదని, ఫేక్ అని ఆఫీస్ సిబ్బంది చెప్పడంతో మేము వెళ్ళేది లేదు, అల్లు అర్జున్ ని కలవాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో సాయంత్రం హైదరాబాద్ లోని N-కన్వెన్షన్ సెంటర్ కు అల్లు అర్జున్ వస్తారని సమాచారం ఇవ్వడంతో అభిమానులు అంతా అక్కడికి వెళ్లారు.

N-కన్వెన్షన్ సెంటర్ దగ్గర దాదాపు 2వేలకు పైగా బన్నీ ఫ్యాన్స్ సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు కాదని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా బన్నీ ఫ్యాన్స్ మాట వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కన్వెన్షన్ సెంటర్ గేటు విరగ్గొట్టారు, బారికేడ్లు తొలగించారు, అద్దాలు పగలకొట్టారు. దీంతో పోలీసులు, N-కన్వెన్షన్ సెంటర్ సెక్యూరిటీ సిబ్బంది ఫ్యాన్స్ పై దాడి చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ లో కొందరికి గాయాలయ్యాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ రాకుండానే ఫ్యాన్స్ మీట్ ని రద్దు చేశారు.

Allu Arjun Fans : బన్నీ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీఛార్జ్..! ఫ్యాన్స్ మీట్ రద్దు

తాజాగా ఈ ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ”తాజాగా జరిగిన ఫ్యాన్స్ మీట్ లో నా అభిమానులకు గాయలు అయినట్టు తెలిసింది. గాయపడిన అభిమానులను నా టీమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. అభిమానులకు సంబంధించిన ప్రతి సమాచారం నాకు తెలుపుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను అని తెలుపుతూ మీ ప్రేమ అభిమానం నాకు కోట్ల ఆస్తి దానిని ఎప్పుడు మర్చిపోను” అని ట్వీట్ చేశారు.