Allu Arjun Fans : బన్నీ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీఛార్జ్..! ఫ్యాన్స్ మీట్ రద్దు

ఇక్కడే తోపులాట తీవ్రమైంది. బన్నీ ఫ్యాన్స్.. కన్వెన్షన్ సెంటర్ గేటు విరగ్గొట్టారు. బారికేడ్లు తొలగించారు. అద్దాలు పగలకొట్టారు.

Allu Arjun Fans : బన్నీ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీఛార్జ్..! ఫ్యాన్స్ మీట్ రద్దు

Allu Arjun Fans

Allu Arjun Fans : అల్లు అర్జున్ తో ఫొటో వార్త.. అభిమానులను తిప్పలు పెడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త కారణంగా జరుగుతున్న పరిణామాలు.. ఉద్రిక్తతకు కారణమయ్యాయి. కోఆర్డినేషన్ లేకపోవడం.. సరైన సమాచారం ఎవరూ ఇవ్వకపోవడంతో.. ఓ దశలో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయిన పరిస్థితి. వారి మధ్యే ఒకరినొకరు తోసుకోవడంతో.. ఉద్రిక్తత తలెత్తింది. భారీగా పోగైన అల్లు అర్జున్ అభిమానులు.. హింసకు దిగుతుండటంతో.. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

Read Also : Allu Arjun : “అల్లు అర్జున్‌తో ఫొటోలు”.. గీతా ఆర్ట్స్ దగ్గర హంగామా

అల్లు అర్జున్ తో ఫొటోలు దిగే అవకాశం వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో పోస్టులతో వందలాది మంది బన్నీ ఫ్యాన్స్ ఈ ఉదయం హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చారు. క్యూలైన్లో నిల్చుని అభిమాన హీరోకోసం సాయంకాలం దాకా వెయిట్ చేశారు. ఐతే… ఫొటో సెషన్ లేదని.. ఫేక్ అని ఆఫీస్ సిబ్బంది చెప్పడంతో డిసప్పాయింట్ అయ్యారు. హీరోను చూపించండి చాలు అని ఫ్యాన్స్ అక్కడి సిబ్బందిని ప్రాధేయపడ్డారు. ఆయన సాయంత్రం N-కన్వెన్షన్ సెంటర్ కు వస్తారని, ఫ్యాన్స్ మీట్, ఫొటో సెషన్ ఉంటుందని సమాచారం ఇవ్వడంతో.. అభిమానులు అంతా అక్కడికి వెళ్లారు.

N-కన్వెన్షన్ సెంటర్ దగ్గర దాదాపు 2వేలకు పైగా బన్నీ ఫ్యాన్స్ చేరుకున్నారు. పరిమిత సంఖ్యలో అభిమానులతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఐతే.. అంచనాకు మించిన సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు కాదని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడే తోపులాట తీవ్రమైంది. బన్నీ ఫ్యాన్స్.. కన్వెన్షన్ సెంటర్ గేటు విరగ్గొట్టారు. బారికేడ్లు తొలగించారు. అద్దాలు పగలకొట్టారు. అభిమానుల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో బన్నీ ఫ్యాన్స్ ను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిపై లాఠీలు ఝలిపించారు. N-కన్వెన్షన్ సెంటర్ సెక్యూరిటీ సిబ్బంది ఫ్యాన్స్ పై దాడి చేశారు. దీంతో… బన్నీ ఫ్యాన్స్ లో కొందరికి గాయాలయ్యాయి.

ఫ్యాన్స్ మీట్ రద్దు

పరిస్థితి చేయిదాటిపోవడంతో… N కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఫొటో సెషన్ ప్రోగ్రామ్ ను అల్లు అర్జున్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఫ్యాన్స్ మీట్ ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.