Allu Arjun: వాట్ నెక్స్ట్.. బన్నీ తర్వాత సినిమా ఎప్పుడో?

పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సెకండ్ పార్ట్ ఎప్పటి నుంచి స్టార్టవుతుందో డేట్ కూడా చెప్పేశారు ప్రొడ్యూసర్లు. బన్నీకి ఆల్రెడీ ఐకాన్ తో పాటు బోయపాటితో సినిమాలు..

Allu Arjun: వాట్ నెక్స్ట్.. బన్నీ తర్వాత సినిమా ఎప్పుడో?

Allu Arjun

Allu Arjun: పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సెకండ్ పార్ట్ ఎప్పటి నుంచి స్టార్టవుతుందో డేట్ కూడా చెప్పేశారు ప్రొడ్యూసర్లు. బన్నీకి ఆల్రెడీ ఐకాన్ తో పాటు బోయపాటితో సినిమాలు లైన్లోఉన్నాయి. ఏ సినిమా కంప్లీట్ చెయ్యాలన్నా కనీసం 7,8 నెలలు కావాల్సిందే. అంతేకాదు.. పుష్ప సినిమా చేసినంత సేపూ బన్నీ ఆ లుక్ మెయింటెన్ చెయ్యాల్సి ఉంటుంది. మరి మిగతా సినిమాలు సెట్స్ మీదకెళ్లేదెప్పుడు అనే ప్రశ్నలు అభిమానుల నుండి వినిపిస్తున్నాయి.

RRR OTT: క్రేజీ అప్డేట్.. ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న స్ట్రీమింగ్ సంస్థ!

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈసినిమా రిలీజ్ కు ఇంకా వారంరోజులు మాత్రమే మిగిలింది. ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా సినిమాప్రమోషన్లు చేస్తున్నటీమ్.. సెకండ్ పార్ట్ షూటింగ్ కి ఫుల్ గా ప్లాన్స్ రెడీ చేసుకుంది.

Soundarya Sharma: భామ చాలా బోల్డ్.. అందాలు అస్సలు దాచుకోదు!

డిసెంబర్ తో పుష్ప ఫస్ట్ పార్ట్ హడావిడి అయిపోతుండడంతో జనవరికి మాత్రం గ్యాప్ ఇచ్చారు టీమ్. అప్పటి వరకూ రిలీజ్ టెన్షన్స్ లో ఉన్న టీమ్.. జనవరిలో కాస్త రిలాక్స్ అయ్యి ఫిబ్రవరి నుంచి సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారని అఫీషియల్ గానే చెప్పింది. అయితే ఇప్పటికే పెండింగ్ లో ఉన్న బన్నీ మిగతా సినిమాల సంగతేంటి అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

Prabhas-Nithya Menen: ప్రభాస్‌ ఇష్యూ నన్ను ఇప్పటికీ బాధ పెడుతుంది: నిత్యా మీనన్

బన్నీ ఇప్పటికే వేణుశ్రీరామ్ ఐకాన్ తో పాటు బోయపాటి శ్రీనుతో సినిమాలు కమిట్ అయ్యారు. కానీ ఈ సినిమాలు ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ లేనట్టే. ఫిబ్రవరి నుంచి పుష్ప షూటింగ్ స్టార్ట్ అయినా.. ప్యార్లల్ గా వేరే సినిమా స్టార్ట్ చెయ్యడానికి వీలు లేదు. ఎందుకంటే బన్నీ.. లాంగ్ హెయిర్ తో పుష్ప లుక్ క్యారీ చెయ్యాల్సి ఉంటుంది. కాబట్టి.. అల్లు అర్జున్ ప్రస్తుతానికి నెక్ట్స్ సినిమా ప్లాన్లన్నీ పక్కన పెట్టి పుష్పకు మాత్రమే ఫుల్ టైమ్ స్పెండ్ చెయ్యాల్సి ఉంటుంది. పుష్ప సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే నెక్ట్స్ సినిమా గురించి ప్లాన్ చేస్కోవాల్సి ఉంటుంది.