RRR OTT: క్రేజీ అప్డేట్.. ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న స్ట్రీమింగ్ సంస్థ!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ రచ్చే కనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు సినీ ప్రేక్షకులు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురి కెరీర్ లో కూడా..

RRR OTT: క్రేజీ అప్డేట్.. ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న స్ట్రీమింగ్ సంస్థ!

Rrr Ott

RRR OTT: ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ రచ్చే కనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు సినీ ప్రేక్షకులు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురి కెరీర్ లో కూడా ఇదే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడం.. తారక్-చెర్రీలను ఒకేసారి స్క్రీన్ మీద చూడాలనే తపన అభిమానులలోనే కాకుండా సగటు సినీ ప్రేక్షకులలో కూడా కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ నుండి వచ్చే అప్డేట్ గురించే కాదు సినిమా ప్రమోషన్ల గురించి కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

Soundarya Sharma: భామ చాలా బోల్డ్.. అందాలు అస్సలు దాచుకోదు!

ఈ మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ఓటీటీ విడుదల కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మరి భారీ హైప్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలో రిలీజ్ తర్వాత ఎన్ని రోజులకు ఓటీటీలో వస్తుంది.. ఏ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ వస్తుంది అనే ఆతృత కూడా సాధారణంగానే ఎక్కువగా ఉంది. కాగా ఆర్ఆర్ఆర్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం డీల్ పూర్తయినట్లు తెలుస్తుంది. అది కూడా థియేటర్ రిలీజ్ తర్వాత 70 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తుందట.

Pushpa-Samantha: స్పెషల్ సాంగ్ కూడా కాపీనేనా.. దేవిశ్రీపై ఆగని ట్రోల్స్!

ఆర్ఆర్ఆర్ ఓటిటి హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించినట్లు సినిమా వర్గాలలో ఇంటర్నల్ టాక్. అయితే ఈ స్ట్రీమింగ్ రైట్స్ ఒక్క హిందీ భాషకే పరిమితమా.. లేక అన్ని భాషలను నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేశారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై అధికారిక క్లారిటీ వస్తే తప్ప ఏ రోజుల స్ట్రీమింగ్ అవుతుంది.. ఏ భాష ఏ సంస్థ దక్కించుకుంది అనేది తెలియదు.