అమర్‌నాథ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్, జూలై 21 నుంచి ప్రారంభం, నియమ నిబంధనలు ఇవే

అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలని అనుకునే భక్తులకు శుభవార్త. అమర్ నాథ్ యాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 21 నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

  • Published By: naveen ,Published On : June 6, 2020 / 07:41 AM IST
అమర్‌నాథ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్, జూలై 21 నుంచి ప్రారంభం, నియమ నిబంధనలు ఇవే

అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలని అనుకునే భక్తులకు శుభవార్త. అమర్ నాథ్ యాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 21 నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలని అనుకునే భక్తులకు శుభవార్త. అమర్ నాథ్ యాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 21 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు టూర్ ఉంటుంది. జూలై 21న ప్రారంభమయ్యే యాత్ర ఆగస్టు 3(శ్రావణ పూర్ణిమ-రక్షా బంధన్) ముగుస్తుంది. కాగా, 55ఏళ్లు పైబడిన వారికి ఈసారి యాత్రకు అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు.

యాత్రకు వెళ్లాలంటే కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ మస్ట్:
యాత్రకు వెళ్లాలని అనుకునే వారు కచ్చితంగా కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఈ శుక్రవారం ప్రథమ పూజ ఉంటుందని శ్రీ అమర్ నాథ్ జీ ఆలయ బోర్డు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా అధికారులు యాత్ర కాలాన్ని కుదించారు. యాత్రకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా లేదని తేలితేనే జమ్మూకాశ్మీర్ లోకి అనుమతిస్తారు. యాత్రికులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అమర్ నాథ్ గుహల్లో ఇచ్చే హారతిని 15 రోజుల పాటు భక్తుల కోసం లైవ్ లో టెలికాస్ట్ చేస్తారు. స్థానిక కూలీల కొరత కారణంగా ఈసారి బాల్తాల్ బేస్ క్యాప్ నుంచి మాత్రమే యాత్రకు అనుమతించనున్నారు. సాధారణంగా పహల్ గామ్ రూట్ నుంచి యాత్రకు అనుమతించే వారు. ఈసారి మాత్రం ఉత్తర కశ్మీర్ లోని బాల్తాల్ నుంచి మాత్రమే యాత్రకు అనుమతిస్తామన్నారు. 

ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్లలేము:
భారతదేశంలోని అత్యంత పవిత్ర శైవ పుణ్య క్షేత్రాల్లో అమర్ నాథ్ ఒకటి. జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో కొలువుదీరింది. భక్తులు ఇక్కడికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెళ్లడం కుదరదు. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఈ యాత్రకు అవకాశం కల్పిస్తారు. ఆ తేదీల కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది (2020) అమర్ నాథ్ యాత్రకు సంబంధించి తేదీలను అధికారులు వెల్లడించారు. సముద్ర మట్టానికి దాదాపు 3వేల 880 మీటర్ల ఎత్తులో అమర్ నాథ్ గుహలు ఉంటాయి. 

Read: లాక్‌డౌన్ వల్ల చిన్నారులపై హింస..వేధింపులు పెరిగాయి : సుప్రీంకోర్టు జడ్జి