Amazon Lay Off Employees : ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. భారత్ లో 1000 మంది

ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్ మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వీటిలో భారత్ కు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరంతా సాఫ్ట్ వేర్, హూమన్ రిసోర్స్, ఇతర విభాగాల్లో పని చేస్తున్నారని తెలుస్తోంది.

Amazon Lay Off Employees : ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. భారత్ లో 1000 మంది

AMAZON

Amazon Lay off employees : ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం భయాందోళనలతో ప్రముఖ సాఫ్ట్ వేర్, ఈ-కామర్స్ కంపెనీలు, సామాజిక మాధ్యమాలు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అందులో భాగంగా ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతున్నాయి. కొత్త నియామకాలను తగ్గించడంతోపాటు కొంతమంది ఉద్యోగులను తొలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్ మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

వీటిలో భారత్ కు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరంతా సాఫ్ట్ వేర్, హూమన్ రిసోర్స్, ఇతర విభాగాల్లో పని చేస్తున్నారని తెలుస్తోంది. జనవరి 18 తర్వాత వీరికి ఈ-మెయిల్, సామాజిక మాధ్యమాలైన లింక్ డ్ ఇన్, ట్విట్టర్ ద్వారా తొలగింపుకు సంబంధించిన సమాచారం అందించనున్నట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా తొలగించనున్న పది వేల మంది ఉద్యోగులకు 5 నెలల జీతాన్ని ముందుగానే చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం.

Amazon Layoff: ఇండియాలోనూ ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. ఎంతమందో తెలుసా?

వీటికి సబంధించి మరిన్ని వివరాల కోసం టీమ్ లీడర్లను కలవాలని మెయిల్స్ లో పేర్కొన్నారు. ఈ ఏడాది తమ కంపెనీలో 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ గతవారం ప్రకటించారు. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులను నియమించుకున్నామని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా వారిని కూడా తొలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెజాన్ స్టోర్స్ పీఎక్స్ టీ ఆర్గనైజేషన్స్ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటించారు.