Bharat Jodo Yatra: వారిలా రాహుల్‭ని కొనలేరు.. అందానీ, అబానీలకు అదెప్పటికీ సాధ్యం కాదు: ప్రియాంక

అదానీ, అంబానీలు దేశంలో అనేక మంది రాజకీయ వేత్తల్ని, మీడియాను కొనుగోలు చేస్తున్నారని విమర్శలు చేసిన ఆమె, తన సోదరుడు రాహుల్ గాంధీని మాత్రం కొనలేరని తేల్చి చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రం తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక, ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతూ మంగళవారం రాహుల్‭తో కలిసి పాల్గొన్నారు

Bharat Jodo Yatra: వారిలా రాహుల్‭ని కొనలేరు.. అందానీ, అబానీలకు అదెప్పటికీ సాధ్యం కాదు: ప్రియాంక

Ambani, Adani bought leaders but couldn’t buy my brother, says Priyanka

Updated On : January 3, 2023 / 4:11 PM IST

Bharat Jodo Yatra: దేశంలో అత్యంత సంపన్నులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలపై అనేక రాజకీయ విమర్శలు ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలకు వీరు నిధులు సమకూరుస్తారని, ప్రతిగా వారు తమ అధికారాన్ని వినియోగించుకుని వీరికి సానుకూలంగా వ్యవహరిస్తుంటారనే విమర్శలు అనేకం వస్తూనే ఉంటాయి. ఇక ఈ విమర్శలు ఒక్కోసారి పతాక స్థాయికి వెళ్లి, అసలు ప్రభుత్వాన్ని వీరే నడుపుతున్నారనే విమర్శలు కూడా వస్తూనే ఉంటాయి. ఇక్కడొక విచిత్రం ఏంటంటే.. వీరికి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుందనే విమర్శలు గతంలో ఉండేవి. అప్పుడు వీటిపై పెద్దగా స్పందించని కాంగ్రెస్, చిత్రంగా అవే విమర్శల్ని తీవ్ర స్థాయిలో చేస్తోంది. ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందని, ఆ ఇద్దరి కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తుందని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు అనేక మంది విమర్శలు చేస్తున్నారు.

CM Jagan Comments On Chandrababu : ‘పేదల్ని చంపి టీడీపీ కోసం త్యాగం చేశారని చెబుతున్నారు’.. చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఇదే విమర్శల్ని రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సైతం చేశారు. అదానీ, అంబానీలు దేశంలో అనేక మంది రాజకీయ వేత్తల్ని, మీడియాను కొనుగోలు చేస్తున్నారని విమర్శలు చేసిన ఆమె, తన సోదరుడు రాహుల్ గాంధీని మాత్రం కొనలేరని తేల్చి చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రం తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక, ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతూ మంగళవారం రాహుల్‭తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘నా అన్నయ్యను (రాహుల్) చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ ఆయన మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. అదానీ, అంబానీలు దేశంలో అనేకం కొనుగోలు చేస్తున్నారు. నాయకుల్ని, మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. కానీ, వారు ఎంత ఖర్చు చేసినా నా సోదరుడిని కొనలేరు. అందుకే నేను నా సోదరుడిని చూసి మరింత గర్వపడుతున్నాను’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.

Renjarla Rajesh Comments : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలు