CM Jagan Comments On Chandrababu : ‘పేదల్ని చంపి టీడీపీ కోసం త్యాగం చేశారని చెబుతున్నారు’.. చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేల చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పొడిచేది, చంపేది.. మొసలి కన్నీళ్లు కార్చేది ఈ పెద్ద మనిషే అని చంద్రబాబును ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఫొటో షూట్, డ్రోన్ షాట్ల కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేశారని పేర్కొన్నారు.

CM Jagan Comments On Chandrababu : ‘పేదల్ని చంపి టీడీపీ కోసం త్యాగం చేశారని చెబుతున్నారు’.. చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

JAGAN

CM Jagan Comments On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పొడిచేది, చంపేది.. మొసలి కన్నీళ్లు కార్చేది ఈ పెద్ద మనిషే అని చంద్రబాబును ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఫొటో షూట్, డ్రోన్ షాట్ల కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేశారని పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ వారోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. వేల మందిని ఒక్క గేటులో పంపించి 29 మందిని చంపేశారని ఆరోపించారు.

తానే మనుషుల్ని చంపేసి… తానే మానవతావాదిలా చంద్రబాబు డ్రామాలు కూడా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరాచకాలను దత్తపుత్రుడు ప్రశ్నించడని విమర్శించారు. పేదల్ని చంపి టీడీపీ కోసం త్యాగం చేశారని చెప్తారని పేర్కొన్నారు. కందుకూరులో రక్తదాహం తీరక గుంటూరులో సభ పెట్టారని విమర్శించారు. చీరల పంపిణీ కోసం వేలల్లో టోకెన్లు ఇచ్చారని పేర్కొన్నారు. కేవలం అరకొర చీరలు మాత్రమే తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు వచ్చే దాకా చీరల పంపిణీ చేయలేదన్నారు.  చీరల కోసం మరో ముగ్గురిని బలి తీసుకున్నారని ఆరోపించారు.

Jagan on Chandrababu: అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు

కందుకూరులో 8 మందిని చంపేశారని పేర్కొన్నారు. తాను బలి తీసుకుని పోలీసులది తప్పు అంటారని తెలిపారు. చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసమేనని తేల్చి చెప్పారు. అధికారం కోసం కూతురును ఇచ్చిన స్వంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలు ఒక లెక్కనా అని అన్నారు. జాబు రావాలంటే బాబు రావాలనేవారు.. బాబు ముఖ్యమంత్రి అయ్యారు.. పిJAGANల్లల్ని మోసం చేశారని విమర్శించారు. జాబులు రాలేదు.. నిరుద్యోగ భృతిని కూడా ఎగ్గొటారని పేర్కొన్నారు.

అప్పట్టో ఉన్న స్కీమ్ దోచుకో..పంచుకో..తినుకో అని జగన్ ఎద్దేవా చేశారు. మీ బిడ్డ(జగన్)కు దేవుడి దయ.. మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. మీ బిడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నమ్ముకున్నారని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో కూలాల యుద్ధం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో క్లాస్ యుద్ధం సాగుతోందని చెప్పారు. పేదవాళ్లు, పెత్తందార్లకు యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు.