Amritpal Singh: లండన్ పారిపోతున్న అమృతపాల్ సింగ్ భార్యను ఎయిర్‭పోర్టులో పట్టుకున్న అధికారులు

పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మార్చిలో, అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ఇంతకు ముందు ప్రశ్నించారు.

Amritpal Singh: లండన్ పారిపోతున్న అమృతపాల్ సింగ్ భార్యను ఎయిర్‭పోర్టులో పట్టుకున్న అధికారులు

Kirandeep Kaur

Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‭ను గురువారం ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వారు వెల్లడించారు. కిరణ్‌దీప్‌ ప్రస్తుతం కస్టమ్స్ అధికారుల అదుపులో ఉన్నారు. సదరు అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్‭కు నోటీసులు పంపిన ఉదయనిధి స్టాలిన్

భారతదేశంలోని దర్యాప్తు అవసరాల కోసం కిరణ్‌దీప్ కౌర్ బయటకు వెళ్లకూడదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. అమృత్‌పాల్ సన్నిహితులు, బంధువులు దేశం విడిచి వెళ్లరాదని ఇప్పటికే సర్క్యులర్ ఉన్నందున అమృతపాల్ భార్య లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు. పంజాబ్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, కిరణ్‌దీప్‭కు బ్రిటన్ పౌరసత్వం ఉంది. అలాగే బ్రిటన్ పాస్‌పోర్ట్ కూడా ఉంది. అయితే ఆమెపై ఆమెపై పంజాబ్‌లో కానీ దేశంలోని మరే చోట కానీ ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు.

Karnataka Polls: మోదీ దేవుడు కాదు.. నడ్డా వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్

ఇంగ్లాండులో నివసిస్తున్న కిరణ్‌దీప్.. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారట. పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మార్చిలో, అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ఇంతకు ముందు ప్రశ్నించారు.

Maharashtra: ఖర్గర్ బహిరంగ సభలో వడదెబ్బ మృతుల సంఖ్య 70 దాటిందట!

మీడియా కథనాల ప్రకారం అమృతపాల్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండుకు చెందిన ఎన్నారై కిరణ్‌దీప్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం, కిరణ్‌దీప్ కౌర్ పంజాబ్‌కు వెళ్లి ఇప్పుడు అమృతపాల్ పూర్వీకుల గ్రామమైన జల్లుపూర్ ఖేడాలో నివసిస్తున్నారు. కిరణ్‌దీప్ కుటుంబ మూలాలు జలంధర్‌లో ఉన్నాయని చెబుతున్నారు. నటుడు-కార్యకర్త దీప్ సిద్ధూ ఏర్పాటు చేసిన వారిస్ పంజాబ్ దే అధినేతగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తర్వాత కిరణ్‌దీప్, అమృతపాల్‌ల వివాహం జరిగిందట.

Assam Govt : అప్పుడు జైలుకు వెళ్లిన వారికి నెలకు రూ.15వేలు పెన్షన్ : మంత్రి అశోక్ సింగల్

మరొకపక్క పరారీలో ఉన్న వారిస్ పంజాబ్ డీ చీఫ్ అమృతపాల్ సింగ్‭ను పట్టుకునేందుకు వేట కొనసాగుతోంది. ఈ ఖలిస్తానీ నాయకుడు కార్లు, బట్టలు, తలపాగా మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు పంజాబ్ పోలీసులు విడుదల చేసిన అనేక సీసీటీవీ ఫుటేజీలలో అతను విభిన్నమైన వేషధారణలో కనిపించాడు.