Amruta Fadnavis: దేశానికి ఇద్దరు జాతి పితలు. ఒకరు మోదీ, మరొకరు.. అమృత ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు

గతంలో కూడా నరేంద్రమోదీని ఉద్దేశించి జాతి పిత అని వ్యాఖ్యానించారు. 2019 సంవత్సరంలో నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా అమృత ఫడ్నవీస్ శుభాకాకంక్షలు తెలిపారు. అందులో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘జాతి పిత నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.

Amruta Fadnavis: దేశానికి ఇద్దరు జాతి పితలు. ఒకరు మోదీ, మరొకరు.. అమృత ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Amruta Fadnavis says Two Fathers of the Nation

Amruta Fadnavis: ఈ దేశానికి ఇద్దరు జాతి పితలు ఉన్నారట. ఒకరు మహాత్మ గాంధీ అయితే, మరొకరు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీనట. ఒకరు గతానికైతే, మరొకరు ప్రస్తుతానికట. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ చెప్పిన మాటలివి. నాగ్‭పూర్‭లో రచయిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఇద్దరినీ భిన్న కేటగిరీలో జాతి పితలుగా ఆమె చెప్పుకొచ్చారు. గాంధీ ఈ దేశానికి జాతి పితేనని, అయితే నూతన భారతానికి మోదీ జాతి పితని ఆమె చెప్పుకొచ్చారు.

India-China Clash: రైతుల ముందు 56, చైనా ముందు 0.56.. మోదీపై ఆప్ ఫైర్

అయితే ఆమె ఇలా వ్యాఖ్యానించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా నరేంద్రమోదీని ఉద్దేశించి జాతి పిత అని వ్యాఖ్యానించారు. 2019 సంవత్సరంలో నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా అమృత ఫడ్నవీస్ శుభాకాకంక్షలు తెలిపారు. అందులో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘జాతి పిత నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు. అయితే తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ విషయమై ఆమెను ప్రశ్నించారు. దేశానికి మహాత్మ గాంధీ జాతి పితగా ఉండగా, నరేంద్రమోదీని ఎలా జాతి పితగా భావిస్తారని సూటిగా ప్రశ్నించారు.

Trump to Musk: ట్విట్టర్ సీఈవోగా దిగిపోనున్న మస్క్.. ట్రంప్ ఏమన్నారంటే?

దీనికి అమృత సమాధానం ఇస్తూ ‘‘మహాత్మగాంధీ ఈ దేశానికి జాతి పిత. అయితే నరేంద్రమోదీ నూతన భారతానికి జాతి పిత. మనకు ఇద్దరు జాతి పితలు ఉన్నారు. ఒకరు ఈ కాలానికి జాతి పిత అయితే మరొకరు ఆ కాలానికి జాతి పిత’’ అని అన్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా అమృత తరుచూ వార్తల్లో ఉంటారు. కొద్ది రోజుల క్రితం మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ఆమె ఒక ట్వీట్ చేశారు. అందులో మరాఠీలో ‘‘ఏక్ థా కపాటీ రాజా’’ అని ట్వీట్ చేశారు. అంటే ‘‘ఒకప్పుడు చెడ్డ రాజు ఉండేవాడు’’ అనేది దాని అర్థం. అయితే ఇది రాజకీయంగా విమర్శలు మూడగట్టుకోవడంతో డిలీడ్ చేశారు.