Trump to Musk: ట్విట్టర్ సీఈవోగా దిగిపోనున్న మస్క్.. ట్రంప్ ఏమన్నారంటే?
‘ట్విట్టర్ బాస్‌గా దిగిపోవాలా?’ అంటూ సోమవారం మస్క్ ఒక పోల్ ట్వీట్ చేశారు. ఇందులో ‘యస్’, ‘నో’ అని రెండు ఆప్షన్లు ఇచ్చారు. కాగా, నెటిజెన్లు మాత్రం ‘యెస్’ అనేదానిపైవే మొగ్గు చూపారు. ఈ పోల్‌కు మొత్తంగా 1.75 కోట్ల ఓట్లు పడ్డాయి. అందులో 57.5 శాతం మంది ట్విట్టర్ బాస్‌గా మస్క్ అవసరం లేదని తేల్చి చెప్పారు. కొత్త నిర్ణయాలు, సంచలన ప్రకటనలతో మస్క్ తరుచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు

Trump thinks Elon Musk's poll about his future as the CEO of Twitter was a good exit strategy
Trump to Musk: ‘ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా?’ స్వయంగా ఎలాన్ మస్క్ పెట్టిన పోల్‌లో యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. సగానికి పైగా యూజర్లు ‘అవును.. దిగిపో’ అంటూ తీర్పు చెప్పారు. ఈ నిర్ణయం ప్రకారం తాను ట్విట్టర్ సీఈవో పదవి నుంచి దిగిపోనున్నట్లు మస్క్ ప్రకటించారు. సీఈఓగా వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన తరువాత నేను ఆ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ తెలిపారు. ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ ట్విటర్‌లో మస్క్ పేర్కొన్నారు.
అయితే ఈ విషయమై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. వాస్తవానికి మస్క్ తీసుకున్న నిర్ణయం మంచిదేనని, పదవీ విరణ చేయడమే ఉత్తమమని తాను భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే తాను ఓడిపోతానని తెలిసి కూడా ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అని మస్క్ పోల్ నిర్వహించారని ట్రంప్ పేర్కొన్నారు. మంగళవారం వన్ అమెరికా న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే, తాను ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తొలగిపోవడంపై చేసిన ట్వీట్లో తనలాంటి ఒక మూర్ఖుడు దొరకగానే ఆ పదవిని అప్పగించి తాను రిటైర్ అవుతానని రాసుకొచ్చారు.
‘ట్విట్టర్ బాస్‌గా దిగిపోవాలా?’ అంటూ సోమవారం మస్క్ ఒక పోల్ ట్వీట్ చేశారు. ఇందులో ‘యస్’, ‘నో’ అని రెండు ఆప్షన్లు ఇచ్చారు. కాగా, నెటిజెన్లు మాత్రం ‘యెస్’ అనేదానిపైవే మొగ్గు చూపారు. ఈ పోల్‌కు మొత్తంగా 1.75 కోట్ల ఓట్లు పడ్డాయి. అందులో 57.5 శాతం మంది ట్విట్టర్ బాస్‌గా మస్క్ అవసరం లేదని తేల్చి చెప్పారు. కొత్త నిర్ణయాలు, సంచలన ప్రకటనలతో మస్క్ తరుచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ స్వాధీనం చేసుకున్న రోజే సంస్థలోని ప్రధాన ఉద్యోగుల తొలగింపు నిర్ణయం నాటి నుంచి ఈ పర్వం కొనసాగుతోంది. మస్క్ నిర్ణయాలతో సంస్థ నష్టాల్లోకి కూరుకుపోతోందనే వార్తలు సైతం గుప్పుమంటున్నాయి. అయితే మస్క్ మాత్రం ట్విట్టర్ ఎంగేజ్మెంట్ పెరుగుతోందని చెప్తున్నారు. ఆ మధ్య బ్లూ టిక్ వివాదం సైతం చాలా వివాదాస్పదమైంది.