Herbal Supplement : పశువుల్లో రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ మిక్చర్

పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రకృతిలో లభించే ఔషధ గుణాలు కలిగిన కొన్ని రకాల దినుసులను ఉపయోగించి సకల పోషక విలువలు ఔషధ గుణాలు కలిగిన హెర్బల్‌ మిక్చర్‌ను తయారుచేసి

Herbal Supplement : పశువుల్లో రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ మిక్చర్

Herbal Mixer

Herbal Supplement : గ్రామీణ జీవన విధానంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచడంలో పాడి పరిశ్రమ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వ్యవసాయంలో వచ్చే నష్టాలను చాలా మంది రైతులు పాడిపశువుల ద్వారా వస్తున్న ఆదాయంతో పూరించుకుంటున్నారు. రైతుల జీవనంలో వెన్నుదన్నుగా ఉంటున్న పశువులను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉంది. వాటికి సకాలంలో పోషకాహారాన్ని అందిస్తూ , రోగాల బారి నుండి కాపాడుకుంటూ మెరుగైన పాలదిగుబడిని పొందేందుకు రైతులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత రోజుల్లో పాడి పశువులకు వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువనే చెప్పాలి. పశువుల పెంపకం విషయంలో, ఆరోగ్యం విషయంలోనూ అధిక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి పాడి రైతులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రకృతిలో లభించే ఔషధ గుణాలు కలిగిన కొన్ని రకాల దినుసులను ఉపయోగించి సకల పోషక విలువలు ఔషధ గుణాలు కలిగిన హెర్బల్‌ మిక్చర్‌ను తయారుచేసి వాటికి ఆహారంగా ఇచ్చినట్లయితే పశువుల్లో జీర్ణశక్తి మెరుగుపడి వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. తద్వారా పశువులకు సంక్రమించే అనేక రకాల వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చు.

హెర్బల్ మిక్సర్ తయారీ ;

కావాల్సిన పదార్ధాలు ; ఉలవలు 1.5 కిలోలు,తాటి బెల్లం1.5 కిలోలు,యాలకులు 50 గ్రా, లవంగాలు100 గ్రా ,సొంఠి 200 గ్రా, మిరియాలు 150 గ్రా, తోక మిరియాలు 50 గ్రాములు, పిప్పళ్లు 50 గ్రా, వాము 200 గ్రా, పాల ఇంగువ100 గ్రా, వెల్లుల్లి 300 గ్రా, మెంతులు 150 గ్రా ,మోదుగుపువ్వు 300 గ్రా, దాల్చిన చెక్క50 గ్రా,నల్లనువ్వులు లేదా వేరు పిసరాకు 1.5 గ్రా,చొప్పున తీసుకోవాలి.

అన్ని పదార్ధాలను కలిపి దంచి మిశ్రమంగా చేసుకొని తగు పాళ్లలో ఆవ నూనె ఒక లీటరు వరకు కలుపుకొని తడి తగలకుండా 2 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. హెర్బల్‌ మిక్చర్‌ను పశువులకు నెలలో 15 రోజులు వాడితే సరిపోతుంది.పాలిచ్చే పశువులకు రోజుకు 50 గ్రాముల హెర్బల్ మిక్సర్ సరిపోతుంది. అదే రెండు నెలలు దాటిన దూడలకు వయసును బట్టి 5 నుండి 20 గ్రాముల మోతాదులో తినిపించాలి.