Balakrishna : అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా..

‘అఖండ’ తో అదిరిపోయే యాక్షన్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు బాలకృష్ణ.. ప్యాచ్ వర్క్ మినహా అంతా కంప్లీట్ చేసుకున్న ‘అఖండ’ సినిమా రిలీజ్ తర్వాత.. బాలయ్య నెక్ట్స్ సినిమా ఏంటి..?

Balakrishna : అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా..

Balakrishna

Balakrishna: ‘అఖండ’ తో అదిరిపోయే యాక్షన్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు బాలకృష్ణ. ప్యాచ్ వర్క్ మినహా అంతా కంప్లీట్ చేసుకున్న ‘అఖండ’ సినిమా రిలీజ్ తర్వాత.. బాలయ్య నెక్ట్స్ సినిమా ఏంటి..? ఇప్పటికే లైన్లో ఉన్న ముగ్గురు డిఫరెంట్ డైరెక్టర్లలో బాలకృష్ణ ఎవరికి గ్రీన్ సిగ్రల్ ఇస్తారు..?

సీనియర్ హీరో బాలకృష్ణ ఇంకా సింగిల్ హీరోగానే సత్తా చూపిస్తున్నారు. ప్రజెంట్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘అఖండ’ లో రెండు డిఫరెంట్ లుక్స్‌తో ఆడియెన్స్‌ని ఎంగేజ్ చెయ్యబోతున్నారు. బాలయ్య – బోయపాటి సినిమా అంటేనే ఫస్ట్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా మీద కూడా హైప్స్ పెరిగిపోయి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

‘అఖండ’ షూటింగ్ లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసింది. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక బాలకృష్ణ నెక్ట్స్ ఏ సినిమా చెయ్యబోతున్నారో అని టాలీవుడ్‌లో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలయ్య బాబుతో సినిమా చెయ్యడానికి ముగ్గురు డైరెక్టర్లు రెడీగా ఉన్నారని టాలీవుడ్ టాక్. రవితేజతో ‘క్రాక్’ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మలినేని గోపీచంద్.. బాలయ్యకు మాంచి స్టోరీ చెప్పాడని, బాలయ్య నెక్ట్స్ ఈ డైరెక్టర్‌తోనే సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. (జూన్ 10న బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని అధికారికంగా ప్రకటించారు).

లేటెస్ట్‌గా బాలయ్య బాబుతో సినిమా చెయ్యడానికి మరో ఇద్దరు జాయిన్ అయ్యారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీస్‌తో ఆడియెన్స్‌‌ని ఎంగేజ్ చేస్తున్న వెంకీ అట్లూరి కూడా బాలకృష్ణతో సినిమాకి రెడీగా ఉన్నారు. ఈ యంగ్ డైరెక్టర్‌తో పాటు కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో సినిమా చెయ్యడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ ఈ సీనియర్ హీరోకి స్టోరీ కూడా చెప్పిన అనిల్.. బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి బాలయ్య లిస్ట్‌లో ఉన్న ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి ఓకే చెబుతారా..? మరో డైరెక్టర్‌తో సినిమా చేస్తారా..? అసలు నెక్ట్స్ ఎలాంటి సబ్జెక్ట్ చేస్తారో అని ఫ్యాన్స్ మాత్రం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.