Ankit Siwach : మాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. బట్టలు లేకుండా ఫోటోలు పంపమన్నారు..

అంకిత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''అందరూ మంచివాళ్ళే అని నేను అనుకునేవాడిని. అలా అనుకోవడమే నా బలహీనతగా మారింది. ఈ వీక్‌నెస్‌ను ఎదుటివాళ్లు యూజ్‌ చేసుకున్నారు. అందరిలో మంచితో...

Ankit Siwach : మాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. బట్టలు లేకుండా ఫోటోలు పంపమన్నారు..

Ankit

 

Ankit Siwach :  సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు బాగా వినిపిస్తుంది. వేరే రంగాల్లో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వాడుకోవడాన్ని క్యాస్టింగ్ కౌచ్ అంటారు. అయితే ఇది కేవలం ఆడవాళ్లకే ఉంటుందని అంతా భ్రమపడుతూ ఉంటారు. మగ వాళ్ళు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కుంటారు. కానీ మగ వాళ్ళు ఎక్కువగా బయటపడలేరు. క్యాస్టింగ్ కౌచ్ పై ఆడవాళ్లు మాట్లాడినంత ఈజీగా మగవాళ్ళు మాట్లాడలేరు. ఒక వేల మాట్లాడినా హేళన చేస్తారు తప్ప ఎవరూ పట్టించుకోరు. కానీ క్యాస్టింగ్ కౌచ్ ఎవరికి జరిగినా అది బాధింపపడటమే.

తాజాగా తాను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితుడినే అంటూ తెలిపాడు బాలీవుడ్ నటుడు అంకిత్‌ సివాచ్‌. మోడల్‌గా, సీరియల్ ఆర్టిస్ట్ గా, సినిమా నటుడిగా కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు అంకిత్. దాదాపు 12 ఏళ్ల క్రితమే తన కెరీర్‌ ని ప్రారంభించినా ఇటీవలే గుర్తింపు వచ్చింది. అయితే ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలని చెపుతూ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ భాదితుడనే అంటూ తెలిపాడు.

Shivathmika : పారిపోయింది నేనా? మా అక్కా??.. ఫేక్ న్యూస్ పై ఫైర్ అయిన శివాత్మిక..

అంకిత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”అందరూ మంచివాళ్ళే అని నేను అనుకునేవాడిని. అలా అనుకోవడమే నా బలహీనతగా మారింది. ఈ వీక్‌నెస్‌ను ఎదుటివాళ్లు యూజ్‌ చేసుకున్నారు. అందరిలో మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. ఒక్కోసారి ఆ చెడు రాక్షసత్వంగా మారి మనల్ని ముప్పుతిప్పలు పెడుతుంది. నేను కెరీర్ ఆరంభంలో మోడలింగ్‌ చేసేటప్పుడు చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నాను. కొంతమంది ఒంటి మీద బట్టలు లేకుండా ఫొటోలు పంపమనేవారు. నాకు ఇచ్చిన పనితో సంబంధం లేకుండా పార్టీలకు రమ్మనేవారు. నన్ను వేధింపులకు గురి చేశారు.”

Shivathmika : పారిపోయింది నేనా? మా అక్కా??.. ఫేక్ న్యూస్ పై ఫైర్ అయిన శివాత్మిక..

”అలాంటి సమయాల్లో చాలాసార్లు మోడలింగ్‌ మానేద్దాం అనుకున్నాను. అలాంటి వాళ్ళందర్నీ చూసి ఈ మోడలింగ్, నటన వదిలేద్దాం అనుకున్నాను. వారి చూపించిన వేధింపులకు మానసిక ఒత్తిడికి లోనయ్యాను. కానీ వాళ్ళు పెద్ద పొజిషన్ లో ఉన్నారు. ఇలా చేయడం వాళ్లకి మామూలే అని ఆగిపోయాను. ప్రతి ఇండస్ట్రీలోను ఈ వేధింపులు ఉన్నాయి. వాటినుంచి మనం తప్పించుకోలేము. ఏదో ఒకసారి ఫేస్‌ చేయాల్సి వస్తుంది. నేను కూడా చాలా సార్లు క్యాస్టింగ్ కౌచ్ కి భాదితుడ్ని అయ్యాను. ఇష్టమున్నా లేకపోయినా కెరీర్‌ కోసమైనా ఆ పని చేయాలి అని కొంతమంది నా పై ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఎదురు తిరిగినా, బతిమాలినా మమ్మల్ని కాదని నువ్వు కెరీర్ లో ముందుకి వెళ్లగలవా అంటూ భయపెట్టేవాళ్ళు” అని తను పడిన కష్టాల గురించి తెలిపాడు.