Anushka Shetty : అనుష్క బరువు తగ్గడానికి వాడుతున్న చిట్కాలు ఇవే..

ఇక అనుష్క వచ్చిన కొత్తలో స్లిమ్ గా ఉండేది ఆ తర్వాత 'సైజ్ జీరో' సినిమా కోసం చాలా లావు అయ్యింది. ఆ తర్వాత తగ్గినా కూడా 'బాహుబలి', 'నిశ్శబ్దం' సినిమాల్లో కూడా కొంచెం బొద్దుగానే

Anushka Shetty :  అనుష్క బరువు తగ్గడానికి వాడుతున్న చిట్కాలు ఇవే..

Anushka

Anushka Shetty :  తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో సైడ్ హీరోయిన్ గా ఎంటర్ అయి స్టార్ హీరోయిన్ గా మారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనుష్క. ‘బాహుబలి’ తర్వాత నుంచి సినిమాలు ఎక్కువగా చెయ్యట్లేదు. ‘బాహుబలి’ తర్వాత ‘నిశ్శబ్దం’ సినిమా ఒక్కటే చేసింది. మళ్ళీ ఇటీవల యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా అనౌన్స్ చేసింది.

Manchu Lakshmi : మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మి ఫిమేల్ లీడ్

ఇక అనుష్క వచ్చిన కొత్తలో స్లిమ్ గా ఉండేది ఆ తర్వాత ‘సైజ్ జీరో’ సినిమా కోసం చాలా లావు అయ్యింది. ఆ తర్వాత తగ్గినా కూడా ‘బాహుబలి’, ‘నిశ్శబ్దం’ సినిమాల్లో కూడా కొంచెం బొద్దుగానే కనిపిస్తుంది. అయితే ఇటీవల అనౌన్స్ చేసిన సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ కావడంతో ఇంకా సన్నగా తయారవ్వాల్సి వస్తుందంట. ఇందుకు కొన్ని చిట్కాలు వాడుతుందట. అనుష్క తన బరువు తగ్గించడానికి వాడే చిట్కాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మీరు కూడా స్లిమ్ గా అవ్వడానికి ట్రై చేస్తున్నారా అయితే అనుష్క చెప్పిన ఈ చిట్కాలు మీరు కూడా ట్రై చేయండి.

Puneeth Rajkumar : కన్నడ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో పునీత్‌కు ఘనంగా నివాళుల కార్యక్రమం

చిట్కా 1: ఎక్కువ‌గా నీళ్లు తీసుకోవడం, మ‌ధ్య మ‌ధ్య‌లో కొబ్బరి నీళ్లను తీసుకోవడం. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డమే కాకుండా చ‌ర్మం కూడా ప్ర‌కాశ‌వంత‌మవుతుందని అనుష్క డైటీషియ‌న్ చెప్పారంట.

చిట్కా 2: ఎక్కువ‌గా కూర‌గాయ‌ల‌ను తీసుకోవడం. నాన్ వెజ్ ని వీలైనంతవరకు దూరం పెట్టడం. ముఖ్యంగా ఫైబ‌ర్ ఉండే కూర‌గాయ‌ల‌ను ఎక్కువగా తినడం.

చిట్కా 3: తిండిని మూడు పూట‌లుగా కాకుండా ఆ మొత్తాన్ని నాలుగైదు వేళ‌ల్లో కొంచెం కొంచెం గ్యాప్ తో తింటుందంట అనుష్క. దీని వ‌ల్ల ఎక్కువ ఆక‌లి వేయ‌కుండా తిండిపై ఎక్కువ దృష్టిపోకుండా కూడా ఉంటుంద‌ట‌.

చిట్కా 4: రాత్రి 8 గంట‌ల‌లోపలే డిన్న‌ర్‌ను పూర్తి చేస్తుంద‌ట అనుష్క.

చిట్కా 5: ఇంటి ఆహారాన్నే తీసుకోవ‌డంతో పాటు అయిల్ ఎక్కువ‌గా లేని ఆహరం తీసుకోవడం.

చిట్కా 6: ఆహారంతో పాటు రెగ్యుల‌ర్‌గా యోగా, ఎక్స‌ర్‌సైజుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుంద‌ట అనుష్క‌.

Bigg Boss 5 : జెస్సి వెళ్ళిపోతూ కంటెస్టెంట్స్ కి సలహాలు.. నువ్వే నా సీక్రెట్ ఫ్రెండ్ అంటూ..

ఇవన్నీ పాటిస్తూ అనుష్క ఇదివరకులా స్లిమ్ గా తయారయి త్వరలో మరో మంచి కథతో మన ముందుకి రాబోతుంది.